AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Starlink India: భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడో తెలుసా..? ధర, స్పీడ్‌ ఎంత?

Starlink India: సాంప్రదాయ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని ప్రాంతాల కోసం ఈ సేవ ప్రత్యేకంగా రూపొదించారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఈ వేగం మధ్యస్థంగా పరిగణించబడినప్పటికీ మారుమూల ప్రాంతాలకు ఇవి గణనీయమైన ఉపశమనం లభించనుంది. భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం, వినియోగదారులు..

Subhash Goud
|

Updated on: Oct 28, 2025 | 1:49 PM

Share
 Starlink India: ఎలోన్ మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ కంపెనీ, స్టార్ లింక్ త్వరలో భారతదేశంలో తన సేవను ప్రారంభించనుంది. కంపెనీకి అవసరమైన అన్ని అనుమతులు దాదాపు లభించాయి. అలాగే ఈ సేవ జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో దాని ధర, వేగం, కనెక్షన్ గురించి వివరాల గురించి తెలుసుకుందాం.

1 / 6
 భారతదేశంలో ప్రారంభించటానికి స్టార్‌లింక్ దాదాపు అన్ని అవసరమైన ప్రభుత్వ అనుమతులను పొందింది. ప్రస్తుతం, కంపెనీ SATCOM ఆమోదం, స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచి ఉంది. నివేదికల ప్రకారం.. ఈ రెండు ప్రక్రియలు 2025 చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను దేశంలో జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ప్రారంభించవచ్చు.

2 / 6
 భారత ప్రభుత్వం స్టార్‌లింక్ కనెక్షన్‌లపై పరిమితిని విధించింది. మార్గదర్శకాల ప్రకారం.. దేశంలో గరిష్టంగా 2 మిలియన్ కనెక్షన్‌లను అందించడానికి స్టార్‌లింక్ అనుమతి ఇస్తుంది. దీని అర్థం ప్రారంభ దశలో కంపెనీ గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి పరిమిత సంఖ్యలో వినియోగదారులకు తన సేవను అందించగలదు.

3 / 6
 భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం, వినియోగదారులు ఒకేసారి సెటప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపు రూ.30,000 లేదా కొంచెం ఎక్కువ కావచ్చు. అదనంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలు రూ.3,300 నుండి ప్రారంభమవుతాయి. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవల కంటే ఎక్కువ. కానీ మారుమూల ప్రాంతాలలో ఇది ఏకైక హై-స్పీడ్ ఎంపికగా మారవచ్చు.

4 / 6
 స్టార్‌లింక్ భారతదేశంలో 25 Mbps నుండి 225 Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుందని పేర్కొంది. ఎంట్రీ-లెవల్ ప్లాన్ 25 Mbps వేగాన్ని అందిస్తుంది. అయితే ప్రీమియం లేదా హై-ఎండ్ ప్లాన్ 225 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది.

5 / 6
 సాంప్రదాయ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని ప్రాంతాల కోసం ఈ సేవ ప్రత్యేకంగా రూపొదించారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఈ వేగం మధ్యస్థంగా పరిగణించబడినప్పటికీ మారుమూల ప్రాంతాలకు ఇవి గణనీయమైన ఉపశమనం లభించనుంది.

6 / 6