ఆసీస్‌తో డే/నైట్ టెస్టుకు రెడీ.. కానీ షరతులు వర్తిస్తాయి..

గతంలో డే/నైట్ టెస్టులు ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపని టీమిండియా.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే.. కచ్చితంగా పింక్ బాల్ టెస్ట్ ఆడతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. 2017-18 పర్యటనలో అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇక ఈ విషయం […]

ఆసీస్‌తో డే/నైట్ టెస్టుకు రెడీ.. కానీ షరతులు వర్తిస్తాయి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 23, 2019 | 11:33 AM

గతంలో డే/నైట్ టెస్టులు ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపని టీమిండియా.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటే.. కచ్చితంగా పింక్ బాల్ టెస్ట్ ఆడతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

2017-18 పర్యటనలో అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇక ఈ విషయం గురించి ప్రస్తావించిన కోహ్లీ.. ‘మేము గులాబీ బంతితో సాధన చేయకుండానే.. హఠాత్తుగా పింక్ బాల్ టెస్ట్ ప్రతిపాదన తీసుకురావడం వల్లే ఆ మ్యాచ్‌ను తిరస్కరించామని అన్నాడు.

అయితే ఇకపై ఆసీస్‌తో డే/నైట్ టెస్టులు ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. కానీ వాటికంటే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ తప్పకుండా ఉండాలని విరాట్ కోహ్లీ కండిషన్ పెట్టాడు. పింక్ బాల్ క్రికెట్‌ ఆడేందుకు సన్నాహకం ఎంతో ముఖ్యం.. అది కుదిరినప్పుడే భవిష్యత్తులో ఎప్పుడు ఆడినా కూడా ఇబ్బంది ఉండదన్నాడు.

ఇకపోతే పింక్ టెస్టుల్లో ఆస్ట్రేలియా ఎదురులేని జట్టుగా ఉంది. ఇప్పటికే దాదాపు 6 డే/నైట్ టెస్టులు ఆడిన ఆసీస్ అన్నింటినిలోనూ విజయాలు అందుకోవడం విశేషం. కాగా, ప్రస్తుతం టెస్టుల్లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న కోహ్లీ సేన పింక్ టెస్టులపై పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి.

Latest Articles