పింక్ టెస్ట్ : విరాట్‌కు దాసోహం అంటోన్న రికార్డ్స్..

పింక్‌ టెస్ట్‌‌లో భారత్‌ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ తగ్గట్లేదు. ఇండియా కెప్టెన్ కోహ్లీ అయితే దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కెప్టెన్ కోహ్లీ…తాజాగా మరో సూపర్‌ రికార్డు అందుకున్నాడు. ఏ ఫార్మాట్‌లోనైనా రెచ్చిపోతోన్న కోహ్లీ ఈడెన్​ వేదికగా జరుగుతున్న డే అండ్‌ నైట్​ పింక్‌ టెస్టులో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 27వ సెంచరీ చేసిన కోహ్లీ….కెరీర్‌లో 70వ శతకం సాధించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు […]

పింక్ టెస్ట్ : విరాట్‌కు దాసోహం అంటోన్న రికార్డ్స్..
Ram Naramaneni

|

Nov 23, 2019 | 9:55 PM

పింక్‌ టెస్ట్‌‌లో భారత్‌ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ తగ్గట్లేదు. ఇండియా కెప్టెన్ కోహ్లీ అయితే దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కెప్టెన్ కోహ్లీ…తాజాగా మరో సూపర్‌ రికార్డు అందుకున్నాడు. ఏ ఫార్మాట్‌లోనైనా రెచ్చిపోతోన్న కోహ్లీ ఈడెన్​ వేదికగా జరుగుతున్న డే అండ్‌ నైట్​ పింక్‌ టెస్టులో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 27వ సెంచరీ చేసిన కోహ్లీ….కెరీర్‌లో 70వ శతకం సాధించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 59 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన కోహ్లీ… 159 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ  సాధించాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో 27వ సెంచరీ. టోటల్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 70సెంచరీలు చేసిన కోహ్లీ ఖాతాలో…. 43 వన్డే సెంచరీలు ఉన్నాయి.

అంతేకాదు వేగంగా ఈ రికార్డును అందుకున్న రెండో ఆటగాడిగా సచిన్​ సరసన నిలిచాడు కోహ్లీ. 141 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత సాధించాడు విరాట్​. బ్రాడ్​మన్ 70 ఇన్నింగ్స్​ల్లోనే 27 సెంచరీలు సాధించి టాప్‌లో ఉన్నాడు. 31 ఏళ్ల కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో వేగంగా 70 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్​మన్​గానూ పేరు తెచ్చుకున్నాడు. సచిన్​ 505 ఇన్నింగ్స్​లు, ఆసీస్​ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్​ 649 ఇన్నింగ్స్​ల్లో ఈ రికార్డు అందుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

దిగ్గజ క్రికెటర్​ సచిన్​ టెండుల్కర్​ రికార్డులను అందుకునే దిశగా పయనిస్తున్న కోహ్లీ… భారత్‌లో జరుగుతున్న తొలి పింక్‌ బాల్‌ టెస్టులోనూ శతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. టీమిండియా సారథిగా 20వ టెస్టు సెంచరీ  చేసిన కోహ్లీ ఈ క్రమంలో పాంటింగ్​ 19వ టెస్టు సెంచరీ రికార్డునూ దాటేశాడు. ప్రస్తుతం  సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీలతో ముందున్నాడు. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి రోజు ఆటలోనూ అర్ధశతకం సాధించి…టెస్టు కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని సాధించాడు కోహ్లీ. ఇదే ఘనతను ఆసీస్​ మాజీ క్రికెటర్​ రికీ పాంటింగ్​ 97 ఇన్నింగ్స్​ల్లో సాధించగా..,విండీస్​ మాజీ క్రికెటర్​ క్లైవ్​ లాయిడ్​ 106 ఇన్నింగ్స్‌ల్లో సాధించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu