ధోని ఈ మౌనం ఎందులకు?

2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని విశ్వసనీయవర్గాల సమాచారం. కోహ్లీ ట్వీట్‌తో […]

ధోని ఈ మౌనం ఎందులకు?
Follow us

|

Updated on: Sep 23, 2019 | 7:50 PM

2019 ప్రపంచకప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన విరామాన్ని నవంబర్ వరకు పొడిగించనున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని విశ్వసనీయవర్గాల సమాచారం.

కోహ్లీ ట్వీట్‌తో ధోని రిటైర్మైంట్‌పై ప్రకంపనలు:

ఇటీవల ధోనీ గురించి భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2016లో టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్‌లో ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ‘నేను ఎన్నటికీ మరిచిపోలేని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిటెనెస్‌ పరీక్షలో పరుగెత్తించినట్టు ధోనీ నన్ను పరుగులు పెట్టించాడు.’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో ధోనీ వీడ్కోలు గురించి పరోక్షంగా కోహ్లీ పోస్ట్ చేశాడని ఊహాగానాలు పెద్దఎత్తున వెల్లువెత్తాయి. ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను ధోనీ సతీమణి సాక్షి కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది.

ధోని రిటైర్మెంట్‌పై కోహ్లి రియాక్షన్:

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ప్రారంభమయ్యే ముందు ధోనీ గురించి కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ‘ధోనీ ఇంకా జట్టుకోసం ఆలోచిస్తున్నాడు. అతడు టీమ్‌ఇండియాకు ఎంతో విలువైన ఆటగాడు, రిటైర్మెంట్‌ అనేది వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయంపై ఇతరులెవరూ మాట్లాడిల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నాడు. ధోనీ భవితవ్యంపై మాజీలు స్పందిస్తూనే ఉన్నారు. ధోనీ తన నిర్ణయాన్ని సెలక్షన్‌ కమిటీకి తెలియజేయాలని సూచిస్తున్నారు. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

15 రోజులు కాశ్మీర్‌లో:

ప్రపంచకప్ 2019 ధోనీ చివరిది అని అనుకున్నారు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్‌లో గడిపాడు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు.

ఈ పుకార్లపై క్లారిటీ ఎప్పుడు?

కాగా ధోని రిటైర్మెంట్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. ఒకవైపు క్రికెట్ ఆడకుండా..మరోవైపు వీడ్కోలు పలకకుండా అతడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. బీసీపీఐ కానీ, భారత కెప్టెన్ కోహ్లీ కానీ ధోని రిటైర్మెంట్‌ నిర్ణయం అతడి వ్యక్తిగతమంటున్నారు. మరి ధోని మనసులో ఏముందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..