AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీవీ సింధు తలకు ఉన్న ఆ వింత డివైజ్ ఏంటీ? మ్యాచ్ ఆడేటప్పుడు ఎందుకు పెట్టుకుందో తెలిస్తే..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కోర్టులో అడుగుపెడితే ఆటతో పాటు రికార్డులు కూడా తిరగరాయాల్సిందేజ.. అయితే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె సాధించిన అద్భుత విజయంతో పాటు నుదుటిపై కనిపించిన ఓ చిన్న పరికరం ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. చూడటానికి చిన్న స్టిక్కర్‌లా ఉన్న ఆ హైటెక్ గాడ్జెట్ ఏంటి? సింధు ఆటతీరును విశ్లేషించే ఆ టెంపుల్ పరికరం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.

పీవీ సింధు తలకు ఉన్న ఆ వింత డివైజ్ ఏంటీ? మ్యాచ్ ఆడేటప్పుడు ఎందుకు పెట్టుకుందో తెలిస్తే..
What Is The Temple Device On Pv Sindhu Head
Krishna S
|

Updated on: Aug 18, 2026 | 8:46 AM

Share

భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన అద్భుతమైన ఆటతీరుతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. 2026 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆమె ఆటతో పాటు అందరి దృష్టినీ ఆకర్షించింది మరో ఆసక్తికర అంశం.. ఆమె నుదుటిపై అతికించి ఉన్న ఒక చిన్న పరికరం. చూడటానికి ఒక చిన్న స్టిక్కర్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ ఏమిటి? మ్యాచ్ ఆడుతున్న సమయంలో సింధు దీన్ని ఎందుకు ధరించింది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.

ఏమిటీ టెంపుల్ డివైస్?

సింధు నుదుటిపై ధరించిన ఈ చిన్న పరికరం పేరు టెంపుల్. ఇది ఏఐ ఆధారిత వేరబుల్ టెక్నాలజీతో రూపొందించిన ఒక ప్రయోగాత్మక ఫిట్‌నెస్ అండ్ బ్రెయిన్ ట్రాకింగ్ డివైస్. క్రీడాకారులు తీవ్రమైన ఒత్తిడి, పోటీ వాతావరణంలో ఉన్నప్పుడు వారి మెదడు, శరీరం ఎలా ప్రతిస్పందిస్తాయో రియల్ టైమ్‌లో విశ్లేషించేందుకు దీన్ని రూపొందించారు.

ఈ పరికరం ఎలా పనిచేస్తుంది?

రక్త ప్రసరణ – ఆక్సిజన్ స్థాయిల పర్యవేక్షణ: మెదడుకు జరిగే రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయులను ఇది నిరంతరం ట్రాక్ చేస్తుంది.

మానసిక ఏకాగ్రత – ఒత్తిడి విశ్లేషణ: ఆటలో కీలక సమయాల్లో ఒత్తిడి, అలసట, మానసిక ఏకాగ్రత స్థాయిలను నమోదు చేస్తుంది.

సైజు – బ్యాటరీ: దాదాపు 1 అంగుళం పొడవుండే ఈ తేలికపాటి పరికరాన్ని ఒకసారి ధరిస్తే 3 నుంచి 4 గంటల పాటు నిరంతరాయంగా డేటాను రికార్డ్ చేయగలదు.

రికవరీ విశ్లేషణ: ఆటగాళ్లు తీవ్రమైన శ్రమ తర్వాత ఎంత వేగంగా పూర్వస్థితికి వస్తున్నారనే విషయాన్ని కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ విశ్లేషించడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది.

దీనిని ఎవరు అభివృద్ధి చేశారు?

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నేతృత్వంలోని బృందం ఈ టెంపుల్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. సింధు ఈ టెక్నాలజీ ప్రయోగ పరీక్షల్లో భాగస్వామిగా ఉంటూ, తన అనుభవాలను, ఫీడ్‌బ్యాక్‌ను డెవలపర్స్ బృందానికి అందిస్తోంది. ఈ పరికరంపై సింధు భర్త వెంకట దత్త సాయి మాట్లాడుతూ.. ‘‘సింధుకు సంబంధించిన మెట్రిక్స్, డేటాను ట్రాక్ చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. ప్రాథమికంగా వస్తున్న ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి’’ అని తెలిపారు.

మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతానికి ఈ టెంపుల్ పరికరం మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో లేదు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ డివైస్‌ను తగిన క్లినికల్, పరిశోధనల అనంతరం రాబోయే 6 నుంచి 12 నెలల్లో సాధారణ ప్రజల వెల్‌నెస్ కోసం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.

క్రీడారంగంలో సరికొత్త విప్లవం

2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న సింధు, తన ఫిట్‌నెస్‌ను, ఆటతీరును అత్యున్నత స్థాయిలో ఉంచుకునేందుకు ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను ముందస్తుగా పరిశీలిస్తోంది. ప్రత్యక్ష మ్యాచ్ వాతావరణంలో ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా లభించే డేటా.. భవిష్యత్తులో భారత అథ్లెట్ల మానసిక, శారీరక శిక్షణలో సరికొత్త విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది.

Follow Us