Vinesh Phogat: భారత్‌కు ఊహించని షాక్.. వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం పక్కా అనుకున్న వేళ ఊహించని షాక్‌ తగిలింది. ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉంటడంతో.. వేటు వేస్తున్నట్లు ఒలింపిక్‌ సంఘం తెలిపింది.

Vinesh Phogat: భారత్‌కు ఊహించని షాక్.. వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు
Vinesh Phogat
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 07, 2024 | 12:38 PM

భారతీయుల హృదయాలు ముక్కలయ్యే వార్త ఇది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్‌‌పై.. 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున  వేటు పడింది. పోటీ నిబంధనల ప్రకారం, ఫోగట్‌ రజత పతకానికి కూడా అర్హత పొందదు.

మంగళవారం ఒక్కరోజే మూడు బౌట్‌లలో గెలుపొంది.. ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్‌పై విధి పగబట్టింది. బుధవారం జరగనున్న ఫైనల్ బౌట్‌లో గెలిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో గోల్డ్ సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా ఆమె హిస్టరీ క్రియేట్ చేసేది. ఒకవేళ ఓడినా రజత పతకం దక్కేది. కానీ ఇలా అనర్హత వేటు పడుతుందని.. ఎవ్వరూ ఊహించలేదు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్‌కు..  క్వాలిఫై అయిన అయిదుగురు మహిళా రెజ్లర్లలో వినేశ్ ఫొగాట్‌ ఒకరు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడాని కంటే ముందు ఆమె భారత్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం చేశారు. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో వినేశ్ ముందు వరసలో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..