పరుగుల రారాజు కూతురి పేరు మీకు తెలుసా..

Usain Bolt Daughter : పరుగులు రారాజు … జమైకా దిగ్గజం.. ఉసేన్ బోల్ట్ ఓ శుభవార్త చెప్పాడు. తాను తండ్రినయ్యానంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈరోజుతో తన చిన్నారి సరిగ్గా 21 రోజులు పూర్తి చేసుకుందని ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకు తన కూతురు ఫొటో కానీ.., పేరును కానీ ప్రకటించని బోల్ట్..తాజాగా చేసిన పోస్ట్‌లో కూతురు పేరు ప్రకటించాడు. బుధవారం తన భార్య కాసీ బెన్నెట్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో కూతురు ఫొటోను […]

పరుగుల రారాజు కూతురి పేరు మీకు తెలుసా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2020 | 6:52 PM

Usain Bolt Daughter : పరుగులు రారాజు … జమైకా దిగ్గజం.. ఉసేన్ బోల్ట్ ఓ శుభవార్త చెప్పాడు. తాను తండ్రినయ్యానంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈరోజుతో తన చిన్నారి సరిగ్గా 21 రోజులు పూర్తి చేసుకుందని ప్రకటించాడు. అయితే ఇప్పటి వరకు తన కూతురు ఫొటో కానీ.., పేరును కానీ ప్రకటించని బోల్ట్..తాజాగా చేసిన పోస్ట్‌లో కూతురు పేరు ప్రకటించాడు. బుధవారం తన భార్య కాసీ బెన్నెట్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో కూతురు ఫొటోను షేర్‌ చేసి పేరును చెప్పాడు.

‘నా ప్రియురాలు కాసీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా… నేను మీ ఆనందాన్ని తప్పా మరేది కోరుకోను… నిన్ను ఎప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత… మేము మా కూతురు ‘ఒలింపియా లైట్నింగ్’‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిచాం’ అంటూ బోల్ట్‌ తన కూతురి పేరును ప్రకటించాడు.