Tokyo Olympics 2020: సానియా మీర్జా, అంకితా రైనా ప్రయాణం ముగిసింది.. మహిళల డబుల్స్ మొదటి రౌండ్‌లోనే ఇంటిబాట
మహిళల డబుల్స్ టెన్నిస్‌లో సానియా మీర్జా, అంకితా రైనా నిరాశపరిచారు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో మూడవ రోజు మిశ్రమ ఫలితాలను అందుకుంది.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకం సాధిస్తుందనుకున్న మరో అంశంలో ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, అంకితా రైనా తొలి రౌండ్‌లో పరాజయం పాలై తీవ్రంగా నిరాశపరిచారు. టెన్నిస్ మహిళల డబుల్స్ ఈవెంట్‌లో సానియా, అంకిత జంట తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన మహిళల జోడీ చేతిలో ఓడిపోయారు. సానియా మీర్జా, అంకితా రైనా మ్యాచ్‌లో మొదట ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో ఇద్దరూ మొదటి సెట్‌ను 6-0తో గెలుచుకున్నారు. దాంతో ఈ మ్యాచులో విజయం సాధింస్తారని ఊహించారు. కానీ, అనంతరం రెండు సెట్లను వరుసగా కోల్పోయింది. తొలి సెట్‌ను గెలుచుకున్న సానియా, అంకిత రెండో, మూడో సెట్లలో 6-7 (0), 8-10 తేడాతో ఓడిపోయారు. దీంతో తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-0, 6-7, (0), 8-10 తేడాతో ఓడిపోయి, ఇంటిబాట పట్టింది.
తొలి సెట్‌లో గెలిచినా.. ఉక్రెయిన్ జోడీ నాడియా సిస్టర్స్ మొదటి సెట్‌ను కోల్పోయారు. దీంతో భారత జోడీ సానియా, అంకిత రెండో రౌండ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమనుకున్నారు. కానీ, కథ తిరగబడింది. మొదటి సెట్‌లో ఒడిన నాడియా సిస్టర్స్.. సానియా-అంకితలను మరో సెట్ గెలవకుండా ప్రతిఘటించారు. దీంతో రెండవ, మూడవ సెట్లో వరుసగా విజయం సాధించారు.
మహిళల డబుల్స్ టెన్నిస్‌లో సానియా మీర్జా, అంకితా రైనా ఇంటిబాట పట్టడంతో టోక్యో ఒలింపిక్స్‌లో మూడవ రోజు భారత అభిమానులను నిరాశపరిచారు. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. బ్యాడ్మింటన్, రోయింగ్ నుంచి అథ్లెట్లు తదుపరి రౌండ్లకు చేరుకున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పతకాల ఆశలను సజీవంగా ఉంచారు.
Tennis doubles, 1st round at #TokyoOlympics: Sania Mirza (in file photo) and Ankita Raina lose to Ukraine’s Nadiia Kichenok and Liudmyla pic.twitter.com/cbh1zHvdnW
— ANI (@ANI) July 25, 2021
Also Read:
Tokyo Olympics 2020: రోయింగ్‌లో పతకం ఆశలు సజీవం.. సెమీస్ చేరిన అర్జున్ లాల్, అరవింద్ సింగ్