Tokyo Olympics 2020: కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ టీం.. నేడు భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్
India's schedule at Tokyo Olympics 2020 on August 6: భారత మహిళల హాకీ టీం శుక్రవారం కాంస్య పతక పోరులో తలపడేందుకు సిద్ధమైంది. కీలక పోరులో గెలిచి పురుషుల జట్టులాగే కాంస్య పతకం సాధించాలని ఆరాటపడుతోంది.
Tokyo Olympics 2020: ఆగస్టు 5 భారత హాకీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే పురుషుల జట్టు 1980లో మొదటి ఒలింపిక్ పతకాన్ని సాధించింది. జర్మనీతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 3-1 లోటు నుంచి 5-4 తేడాతో విజయం సాధించింది. 2012 లండన్ స్వర్ణ పతక విజేతలు, అలాగే 2016 రియోలోకాంస్య విజేత జట్టుతో జరిగిన మ్యాచులో భారత్‌కు ఇది అత్యధిక స్కోరింగ్. దీనిని చాలా మంది మాజీ హాకీ క్రీడాకారులు, అభిమానులు భారత హాకీకి టర్నింగ్ పాయింట్ అంటూ సంబరపడిపోతున్నారు. అయితే ప్రస్తుతం అన్ని ఆశలు రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత మహిళల హాకీ జట్టుపైనే ఉన్నాయి. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో గ్రేట్ బ్రిటన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, మహిళా జట్టుకు ఇదే తొలి ఒలింపిక్ పతకం అవుతుంది. పూల్ మ్యాచ్‌లలో భారతదేశం గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయినప్పటికీ, క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో సహా మూడు విజయాలు అందుకుంది.
రెజ్లింగ్‌లో భారతదేశం మిశ్రమఫలితాలను కలిగి ఉంది. అన్షు మాలిక్ మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల రిపెఛేజ్ మ్యాచ్‌లో 1-5తో రష్యా అథ్లెట్ వలేరియా కొబ్లోవాతో ఓడిపోయింది. గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఓటమిపాలైంది. 53 కిలోల రెజ్లింగ్ విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన వెనెస్సాపై 3-9 తేడాతో ఓడిపోయింది. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో స్వీడన్ క్రీడాకారిణి సోఫియాను 7-1 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఫోగాట్.. ఇప్పుడు ఓడిపోవడంతో ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇక వినేష్‌కు కాంస్యం దక్కాలంటే.. వెనెస్సా ఫైనల్స్ చేరేంతవరకు వేచి చూడాల్సిందే.
భారత స్టార్ రెజ్లర్ రవి రజతంతో సరిపెట్టుకున్నాడు. హోరా హోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో ఓడిపోయాడు. ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
టోక్యో ఒలింపిక్స్‌లో ఆగస్టు 6 న భారత షెడ్యూల్ క్రింది విధంగా ఉంది: అథ్లెటిక్స్ పోటీలు మధ్యాహ్నం 1:00 గంటలకు: మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఫైనల్: భావనాజాట్ -ప్రియాంక గోస్వామి ఉదయం 2:00 గంటలకు: పురుషుల 50 కిలోమీటర్ల రేస్ వాక్ ఫైనల్: గురుప్రీత్ సింగ్ సాయంత్రం 5:07 గంటలకు: పురుషుల 4×400 మీటర్ల రిలే రౌండ్ 1 హీట్ 2: భారత 4×400 పురుషుల రిలే జట్టు
గోల్ఫ్ ఉదయం 5.29 గంటలకు: మహిళల రౌండ్ 3: దీక్షా దగర్ ఉదయం 5.48 గంటలకు: మహిళల రౌండ్ 3: అదితి అశోక్
హాకీ ఉదయం 7 గంటలకు: మహిళల కాంస్య పతకం మ్యాచ్: రాణి రాంప్లా నేతృత్వంలోని భారత మహిళలు గ్రేట్ బ్రిటన్‌తో తలపడుతుంది.
రెజ్లింగ్ ఉదయం 8 గంటలకు: పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల 16 రౌండ్: భజరంగ్ పునియా వర్సెస్ ఎర్నాజర్ అక్మతలీవ్ ఉదయం 8 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల 16 రౌండ్: సీమ బిస్లా వర్సెస్ సర్రా హమ్ది
It’s a big day for #TeamIndia at #Tokyo2020 tomorrow as Women’s hockey team will fight for bronze at the @Olympics
Wondering what else is lined up? Check the full schedule ?? for 6 Aug and don’t forget to #Cheer4India#Olympics pic.twitter.com/755o79jvHB
— SAIMedia (@Media_SAI) August 5, 2021
Ravi Kumar Dahiya: భారత్‌కు మరో పథకం.. సిల్వర్ మెడల్ సాధించిన రవి దహియా