Cricket: తమ అభిమాన క్రికెటర్ కు హాంకాంగ్ టీమ్ అదిరిపోయే గిఫ్ట్.. సంతోషంలో ఇండియన్ క్రికెటర్..
మనకు నచ్చినవారికి బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం. మనం అభిమానిస్తున్నామంటే అవతలి వ్యక్తిలో ఎంత టాలెంట్ ఉండి ఉండాలి. సాధారణంగా క్రికెట్ అభిమానులు ఎంతో మంది క్రికెటర్లను..
Sports News: మనకు నచ్చినవారికి బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం. మనం అభిమానిస్తున్నామంటే అవతలి వ్యక్తిలో ఎంత టాలెంట్ ఉండి ఉండాలి. సాధారణంగా క్రికెట్ అభిమానులు ఎంతో మంది క్రికెటర్లను అభిమానిస్తుంటారు. కాని క్రికెటర్లే మరో క్రికెటర్ ని అభిమానించడంమంటే మూమూలు విషయం కాదు కదా.. పోనీ ఎవరో ఒకరు కాదు.. ఆజట్టు మొత్తం ఆ క్రికెటర్ ను అభిమానిస్తోంది. అదీ ఓ ఇండియన్ క్రికెటర్ ని.. ఎవరబ్బా ఆక్రికెటర్ అని అనుకుంటున్నారా.. ఇంకెవరు విరాట్ కోహ్లీ.. హాంకాంగ్ క్రికెట్ జట్టుకి విరాట్ కోహ్లీ అంటే ఎంతో అభిమానం అంట.. అందుకే ఆసియా కప్ లో భాగంగా భారత్ -హాంకాంగ్ మధ్య ఆగష్టు 31వ తేదీన దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం.. హాంకాంగ్ టీమ్ మొత్తం విరాట్ కోహ్లీకి తమ జెర్సీని బహుమతిగా అందించిందంట.. ఏదో జర్సీ ఇవ్వడంలో గొప్పేంటి అనుకుంటున్నారా.. ఆజెర్సీపై రాసి ఉన్న సందేశమే వేరీ స్పెషల్..ఇంతకీ ఆజెర్సీపై ఉన్న మెసెజ్ ఏమిటనుకుంటున్నారా..
“ఓ జనరేషన్‌ను ఇన్‌స్పైర్ చేసినందుకు థ్యాంక్యూ. మేము నీతోనే ఉంటాము. రానున్నవి చాలా అద్భుతమైన రోజులు. ప్రేమతో టీమ్ హాంకాంగ్” అనే సందేశాన్ని ఆ జెర్సీపై రాసి కోహ్లికి బహుమతిగా ఇచ్చారు. ఇటీవల ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఆసియా కప్ లో మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్‌పై 35 పరుగులు, రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 44 బాల్స్‌లో 59 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఆరు నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. విరాట్ కు హాంకాంగ్ టీమ్ మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే తమ అభిమాన క్రికెటర్ కు అదిరిపోయే బహుమతి ఇచ్చారు. మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా హాంకాంగ్ టీమ్ ప్లేయర్స్ ఎంతో గొప్ప మనసు చాటుకున్నారు. హాంకాంగ్ క్రికెట్ జట్టు ఇచ్చిన స్పెషల్ మెసెజ్ తో కూడిన జెర్సీపై కోహ్లీ స్పందించాడు. థ్యాంక్యూ హాంకాంగ్ టీమ్. మీ అభిమానం ఎంతో వినయపూర్వకంగా, చాలా స్వీట్‌గా ఉంది అంటూ కోహ్లి ఈ ఫొటోను తన అభిమానులతో పంచుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..