AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నా: శిఖర్ ధావన్

టీమిండియా స్టార్ బ్యాట్స్మేన్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాషన్ కు ప్రాధాన్యమిస్తూ శరీరంపై రకరకాల టాటూలు వేయించుకుంటాడు.

అందుకే హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నా: శిఖర్ ధావన్
Shikhar Dhawan
Aravind B
|

Updated on: Mar 27, 2023 | 6:46 PM

Share

టీమిండియా స్టార్ బ్యాట్స్మేన్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాషన్ కు ప్రాధాన్యమిస్తూ శరీరంపై రకరకాల టాటూలు వేయించుకుంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న అతను తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాకు 15 ఏళ్ల వయసున్నుప్పడు మనాలికి వెళ్లాను. అక్కడ మా తల్లిదండ్రులకు తెలియకుండా నా వీపు మీద టాటూ వేయించుకున్నాను. ఈ విషయాన్ని 3 – 4 నెలలు దాచిపెట్టాను. తర్వాత మా నాన్నకి నేను టాటూ వేయించుకున్న విషయం తెలిసిపోయింది. నాకు పచ్చబొట్టు పొడిసిన సూదితో చాలామందికి పచ్చబొట్టు పొడిసుంటారని… ఎందుకు టాటూ వేయించుకున్నావని నాన్న కొట్టారు. అలాంటి సూదితో టాటూ వేయించుకుంటే ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. నాన్న మాటలకు భయమేసి వెంటనే వెళ్లీ ఎయిడ్స్ పరీక్ష చేయించుకున్నాను. అదృష్టవశాత్తు ఆ టెస్టులో నెగటీవ్ వచ్చిందని శిఖర్ దావన్ నవ్వుతూ చెప్పారు.

2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు లేవని.. భవిష్యత్తులో అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలని రాసిపెట్టుంటే తప్పకుండా వెళ్తానని చెప్పారు. తాను ఏ రంగంలో ఉన్న 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 11 ఏళ్ల నుంచి కష్టపడి పనిచేస్తున్నానని ప్రతి రంగంలోనూ ఇటువంటి సక్సెస్ మంత్ర ఉంటుందని తెలిపారు. రాజకీయాల్లో చేరే విషయంపై ఇప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదని.. రాజకీయాల్లోకి రావాలని దేవుడు సంకల్పిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..