‘బౌండరీ’కి బదులు…సచిన్ ప్రతిపాదన!
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సమానంగా ఆడినప్పటికీ బౌండరీ విధానంతో ఇంగ్లీషు టీమ్‌ను విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ఫలితం రాబట్టేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. బౌండరీ విధానంతో ఫలితం తేల్చకుండా మరో సూపర్ ఓవర్ ఆడించివుంటే బాగుండేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఫైనల్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ఫుట్‌బాల్‌లో ఫలితం తేలకపోతే అదనపు సమయం ఇస్తారని […]
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సమానంగా ఆడినప్పటికీ బౌండరీ విధానంతో ఇంగ్లీషు టీమ్‌ను విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ఫలితం రాబట్టేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. బౌండరీ విధానంతో ఫలితం తేల్చకుండా మరో సూపర్ ఓవర్ ఆడించివుంటే బాగుండేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఫైనల్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ఫుట్‌బాల్‌లో ఫలితం తేలకపోతే అదనపు సమయం ఇస్తారని గుర్తుచేశాడు. బౌండరీ నింబధనను రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ కూడా తప్పుబట్టారు.
ప్రపంచకప్‌లో నాకౌట్ విధానంలోనూ మార్పులు చేయాల్సిన అవసరముందని సచిన్ అభిప్రాపడ్డాడు. ఐపీఎల్ తరహాలో టాప్‌లో నిలిచిన జట్టుకు నాకౌట్‌లో ఓడితే మరొక అవకాశం కల్పించాలని సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపిస్తే బాగుండని సచిన్ అభిప్రాయపడ్డాడు. ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ తర్వాత క్రీజ్‌లో రావాల్సిందని స్పష్టంచేశాడు.