కోహ్లీ, రోహిత్ విబేధాలు.. బుజ్జగింపు చర్యలో బీసీసీఐ!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలు తలెత్తాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య సఖ్యత తీసుకురావడానికి బీసీసీఐ బుజ్జగింపు చర్యల చేపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లు ఆడేందుకు భారత్.. యుఎస్ పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా వచ్చే వారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ కూడా యుఎస్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కోహ్లీ, రోహిత్‌లతో మాట్లాడి […]

  • Ravi Kiran
  • Publish Date - 7:14 pm, Mon, 29 July 19
కోహ్లీ, రోహిత్ విబేధాలు.. బుజ్జగింపు చర్యలో బీసీసీఐ!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలు తలెత్తాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య సఖ్యత తీసుకురావడానికి బీసీసీఐ బుజ్జగింపు చర్యల చేపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లు ఆడేందుకు భారత్.. యుఎస్ పయనం కానుంది.

ఈ పర్యటనలో భాగంగా వచ్చే వారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ కూడా యుఎస్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కోహ్లీ, రోహిత్‌లతో మాట్లాడి వాళ్ళ మధ్య విబేధాలను తొలగించాలని చూస్తున్నారట. ఇద్దరి మధ్య ఆంతర్యాన్ని తగ్గించి జట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది.

ఇది ఇలా ఉండగా ఇటీవల జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీని.. ఓ రిపోర్టర్ ఈ ప్రశ్న అడగ్గా.. రోహిత్‌కు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని కోహ్లీ అన్నాడు. ఏది ఏమైనా రోహిత్ శర్మకు, కోహ్లీకి మధ్య వార్ నడుస్తోందని మాత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది.