తొలిసారిగా… ఐపీఎల్ టీం లోకి మహిళ!

తొలిసారిగా... ఐపీఎల్ టీం లోకి మహిళ!

ఐపీఎల్‌‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీ తమ జట్టు సహాయక బృందంలో ఓ మహిళను నియమించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఆర్సీబీ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో గురువారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌కు నవ్‌నీతా గౌతమ్‌ అనే మసాజ్‌ థెరపిస్ట్‌ను నియమించుకున్నామని, ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను ఆమె పర్యవేక్షిస్తారని తెలిపింది. కాగా ఐపీఎల్‌ల్లో ఒక మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Oct 18, 2019 | 5:50 PM

ఐపీఎల్‌‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీ తమ జట్టు సహాయక బృందంలో ఓ మహిళను నియమించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఆర్సీబీ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో గురువారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌కు నవ్‌నీతా గౌతమ్‌ అనే మసాజ్‌ థెరపిస్ట్‌ను నియమించుకున్నామని, ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను ఆమె పర్యవేక్షిస్తారని తెలిపింది. కాగా ఐపీఎల్‌ల్లో ఒక మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ గర్వపడుతుందని పేర్కొంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక నైపుణ్య సాధనాలు చేయించడం, మోటివేషన్‌ కలిగించడంతో పాటు శారీరక గాయాలకు సంబంధించిన చికిత్స అందించడం ఆమె పని. ఈ విషయంపై స్పందించిన ఆర్సీబీ ఛైర్మన్‌ సంజీవ్‌ చురివాలా.. ఒక చారిత్రక ఘట్టంలో భాగస్వామి అయినందున తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆటలో మహిళా ప్రధాన్యాన్ని గుర్తించి సహాయక బృందాల్లోనూ వారికి అవకాశమివ్వడం అతి ముఖ్యమన్నారు. అన్ని క్రీడా విభాగాల్లో మహిళల భాగస్వామ్యంతో పాటు వారు సాధిస్తున్న విజయాలే నవ్‌నీతా ఎంపికకు కారణమని ఆయన వెల్లడించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu