జ‌డేజా సంచ‌ల‌నం.. 21వ శతాబ్దపు విలువైన క్రికెటర్‌గా అరుదైన గౌరవం..

ప్ర‌స్తుత భారత క్రికెట్ టీమ్ లో సీనియ‌ర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్ లో అస‌మాన్య ప్ర‌తిభ చూపుతోన్న అత‌నిని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా విజ్డెన్ ఇండియా అనౌన్స్ చేసింది.

జ‌డేజా సంచ‌ల‌నం..  21వ శతాబ్దపు విలువైన క్రికెటర్‌గా అరుదైన గౌరవం..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 3:58 PM

ప్ర‌స్తుత భారత క్రికెట్ టీమ్ లో సీనియ‌ర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అరుదైన గౌరవం దక్కింది. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్ లో అస‌మాన్య ప్ర‌తిభ చూపుతోన్న అత‌నిని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా విజ్డెన్ ఇండియా అనౌన్స్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ జ‌డ్డూ అత్యద్భుతంగా రాణిస్తున్నాడ‌ని పేర్కొంది. క్రిక్‌విజ్ టూల్ స‌హాయంతో ర‌వీంద్ర‌ జడేజా ప్రదర్శనని విశ్లేషించిన విజ్డెన్ ఇండియా.. అతనికి ఏకంగా 97.3 రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. జడేజా కంటే శ్రీలంక లెజండ‌రీ క్రికెటర్ ముత్తయ్ మురళీధరన్ మాత్రమే ఈ రేటింగ్‌లో ముందున్నాడు.

2009లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన‌ రవీంద్ర జడేజా… మూడేళ్ల వరకూ టెస్టుల్లో చోటు ద‌క్క‌లేదు. 2012లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టులో ఆడిన జడ్డూకి.. ఆ తర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. బౌలింగులో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ.. మిడిలార్డర్‌లో సత్తా ఉన్న‌ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. చాలాసార్లు.. టెయిలెండర్లతో కలిసి భారత్‌కి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. కాగా జ‌డేజా ఇప్పటి వరకూ 49 టెస్టులాడి 35.26 సగటుతో 1,869 ర‌న్స్ చేశాడు. ఆసిస్ మాజీ ఆల్‌రౌండన్ షేన్‌ వాట్సన్ టెస్టు సగటు 35.2 కంటే ముందంజ‌లో ఉన్నాడు జ‌డేజా. ఇదే విషయాన్ని విజ్డెన్ ఇండియా కూడా తెలిపింది.

టెస్టుల్లో 2.44 ఎకానమీతో బౌలింగ్ చేసిన జడ్డూ.. ఇప్పటి వరకూ 213 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 24.63గా ఉంది. టెస్టుల్లో ఒకసారి 10 వికెట్ల ఘనతని కూడా అందుకున్న‌ జడేజా.. తొమ్మిదిసార్లు 5 వికెట్ల మైలురాయిని ఒడిసిప‌ట్టాడు. బ్యాటింగ్‌లోనూ అతని ఖాతాలో ఒక శ‌త‌కం, 14 అర్థ శ‌త‌కాలు ఉన్నాయి.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం