డివిలియర్స్​ రిటైర్మెంట్​కు అసలు కార‌ణం అదేన‌ట‌..!

2015 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​తో పరాజయం.. తనపై సంవత్సరం పాటు ఎఫెక్ట్ చూపించిందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్​​ ఏబీ డివిలియర్స్​ అన్నాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:26 pm, Wed, 1 July 20
డివిలియర్స్​ రిటైర్మెంట్​కు అసలు కార‌ణం అదేన‌ట‌..!

2015 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​తో పరాజయం.. తనపై సంవత్సరం పాటు ఎఫెక్ట్ చూపించిందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్​​ ఏబీ డివిలియర్స్​ అన్నాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు వీడ్కోలు చెప్పాల‌న్న‌ ఆకస్మిక నిర్ణయంలో.. ఆ సంఘటన ముఖ్య పాత్ర‌ పోషించిందని తెలిపాడు. ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడిన డివిలియర్స్​ అప్ప‌టి జ్ఞాపకాలను నెమ‌రువేసుకున్నాడు.

వ‌ర‌ల్డ్ వైడ్ బెస్ట్ బ్యాట్స్​మన్​లలో ఒకడిగా డివిలియర్స్​ ఖ్యాతి గ‌డించాడు. కెరీర్​ పీక్ స్టేజీలో ఉండగా.. 2018లో 14ఏళ్ల ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు. టోర్నీకి గుడ్​బై చెప్పే ముందు తాను అలసిపోయినట్లు డివిలియర్స్​ వెల్ల‌డించారు. కాగా 2015లో జరిగిన వ‌ర‌ల్డ్ క‌ప్​ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​- దక్షిణాఫ్రికా పోటీప‌డ్డాయి. అయితే వర్షం కారణంగా డక్​వర్త్​లూయీస్ పద్దతి ప్ర‌కారం న్యూజిలాండ్​ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో సఫారీ జట్టు ఓడిపోయింది.