హిట్ మ్యాన్ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్..

భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. రాజ్ కోట్ వన్డేలో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు.  హిట్ మ్యాన్ కేవలం 137 ఇన్నింగ్స్‌లో ఈ క్రేజీ రికార్డు అందుకోగా..  ఆమ్లా 147, సచిన్ 160 ఇన్నింగ్స్‌లలో ఏడు వేల రన్స్ కంప్లీట్ చేశారు. రోహిత్ 2013 నుంచి ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ అద్బుత ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:13 pm, Fri, 17 January 20
హిట్ మ్యాన్ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్..

భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. రాజ్ కోట్ వన్డేలో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు.  హిట్ మ్యాన్ కేవలం 137 ఇన్నింగ్స్‌లో ఈ క్రేజీ రికార్డు అందుకోగా..  ఆమ్లా 147, సచిన్ 160 ఇన్నింగ్స్‌లలో ఏడు వేల రన్స్ కంప్లీట్ చేశారు. రోహిత్ 2013 నుంచి ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ అద్బుత ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక మరో క్రేజీ రికార్డు జస్ట్ మిస్ అయ్యాడు హిట్ మ్యాన్.  రాజ్ కోట్ వన్డేలో 42 వద్ద అవుటైన రోహిత్ శర్మ… మరో 4 పరుగులు బాదితే వన్డేల్లో 9  వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా మరో రికార్డు ఒడిసిపట్టేవాడు.