Pro Kabaddi League: కబడ్డీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే..
Pro Kabaddi League: క్రీడాభిమానులను అట్రాక్ట్ చేస్తూ సీజన్ సీజన్‌కి పాపులారిటీ సంపాదించుకుంటోన్న ప్రొ కబడ్డీ లీగ్ తర్వాతి సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రొ కబడ్డీ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానుంది...
Pro Kabaddi League: క్రీడాభిమానులను అట్రాక్ట్ చేస్తూ సీజన్ సీజన్‌కి పాపులారిటీ సంపాదించుకుంటోన్న ప్రొ కబడ్డీ లీగ్ తర్వాతి సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రొ కబడ్డీ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. లీగ్ దశలో మ్యాచ్‌లు హైదరాబాద్, పుణె, బెంగళూరులో జరగనున్నాయి. అక్టోబర్ 7న ప్రారంభమయ్యే ఈ లీగ్ డిసెంబర్ వరకు కొనసాగనుంది. ఈ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఆగస్టు 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రొ కబడ్డీ లీగ్‌కు సంబంధించి మషాల్ స్పోర్ట్స్ అండ్ లీగ్ కమీషనర్, స్పోర్ట్స్ లీగ్స్ హెడ్ అనుపమ్ గోస్వామి పలు విషయాలను తెలియజేశారు. స్వదేశీ క్రీడలను దృష్టిలో పెట్టుకునే మాషాల్ స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపారు. రాబోయే తరాల క్రీడాభిమానుల కోసమే ఈ క్రీడలను నిర్వహిస్తుందన్నారు. లీగ్‌ను నిర్వహించిన ప్రతీసారి విశేష ఆదరణ లభిస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కారణంగా ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్‌ను బయోబబుల్ నిర్వాహించామని, రాబోయే సీజన్‌లో మాత్రం మరింత ఉత్సాహంగా నిర్వహించనున్నామని గోస్వామి చెప్పుకొచ్చారు.
మరిన్ని స్పోర్ట్స్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..