Cricket: ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ అతనే.. త్వరలో అధికారిక ప్రకటన చేయనన్న సీఏ..

తమ బృందంలోని ఓ మహిళకు అసభ్యకర సందేశాలు పంపించాడన్న ఆరోపణలు వెలువడడంతో ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్సీ నుం

Cricket: ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ అతనే.. త్వరలో అధికారిక ప్రకటన చేయనన్న సీఏ..
Follow us

|

Updated on: Nov 20, 2021 | 1:26 PM

తమ బృందంలోని ఓ మహిళకు అసభ్యకర సందేశాలు పంపించాడన్న ఆరోపణలు వెలువడడంతో ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి టిమ్‌ పైన్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతని రాజీనామా నేపథ్యంలో కొత్త నాయకుడు ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొద్దిరోజుల్లోనే ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. దీంతో సమర్థవంతమైన సారథిని ఎంపిక చేసే పనిలో క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఉంది. అయితే ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ దాదాపు ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతని ఎంపికపై క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.

అదేవిధంగా కమిన్స్‌కు తోడుగా వైస్‌ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ను నియమించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే టిమ్‌ పైన్‌ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇందులో కమిన్స్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అతనే సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక నాసిరకం ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న పైన్‌ తాజా ఆరోపణలతో జట్టులో స్థానం నిలుపుకుంటాడో లేదో చూడాలి. 1964లో ఆసీస్‌ కెప్టెన్‌గా ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌గా రిచి బెనాడ్ బాధ్యతలు చేపట్టాడు. ఆతర్వాత నుంచి మరే బౌలర్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించలేదు. ఒకవేళ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే అది ఒక చరిత్ర కానుంది.

Also Read:

IND vs NZ: సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి వచ్చిన రోహిత్‌ అభిమాని.. ఏం చేశాడంటే..

Cricket: విచిత్ర రీతిలో రనౌటైన షోయబ్‌ మాలిక్‌.. ఏకిపారేస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

IND vs NZ: ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన హర్షల్ పటేల్.. కివీస్‌ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపంచాడు..

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!