IND vs NZ: సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి వచ్చిన రోహిత్‌ అభిమాని.. ఏం చేశాడంటే..

టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో...

IND vs NZ: సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి వచ్చిన  రోహిత్‌ అభిమాని.. ఏం చేశాడంటే..
Follow us

|

Updated on: Nov 20, 2021 | 9:35 AM

టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండో టీ 20 మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారత్‌ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఇండియా సునాయసంగా చేధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ సాగుతుండగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమాని ఒకరు సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేస్తున్న రోహిత్‌ వద్దకి వెళ్లిన ఆ అభిమాని అమాంతం హిట్‌మ్యాన్‌ పాదాలపై పడిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో భారత కెప్టెన్‌ కూడా ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని గ్రౌండ్‌ నుంచి బయటకు తీసుకెళ్లారు.

గతంలో కూడా చాలా సార్లు అభిమానులు ఇలా మైదానంలో దూసుకొచ్చారు. అభిమాన క్రికెటర్లను హత్తుకుంటూ హంగామా సృష్టించారు. అయితే తాజాగా జరిగిన సంఘటనపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైదానంలోని ఆటగాళ్ల భద్రత కోసం మరిన్ని పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో క్రికెటర్లంతా బయోబబుల్‌లో గడుపుతున్నారని.. ఈ సమయంలో ఏదైనా జరిగితే సిరీస్‌ మొత్తం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాగా ఈ ఘటనలో అభిమాని రోహిత్‌ శర్మను తాకలేదని, కేవలం పాదాలపై పడడానికి ప్రయత్నించాడని.. రోహిత్‌ కూడా అతనిని ముట్టుకోలేదని పలువురు చెబుతున్నారు.

Also Read:

Cricket: విచిత్ర రీతిలో రనౌటైన షోయబ్‌ మాలిక్‌.. ఏకిపారేస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

IND vs NZ: ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన హర్షల్ పటేల్.. కివీస్‌ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపంచాడు..

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు