AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Open: యూఎస్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్.. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్‌ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్..!

Novak Djokovic: యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్ మ్యాచ్ 5 సెట్ల వరకు కొనసాగింది. అలెగ్జాండర్ జెరోవ్‌తో తలడిన జకోవిచ్ 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో గెలిచాడు.

US Open: యూఎస్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్.. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్‌ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్..!
Novak Djokovic
Venkata Chari
|

Updated on: Sep 11, 2021 | 11:46 AM

Share

Novak Djokovic: సెర్బియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ సెమీ ఫైనల్స్ గెలవడానికి తీవ్రంగా పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి జకోవిచ్‌నే విజయ వరించింది. యూఎస్ ఓపెన్ ఫైనల్ కోసం టికెట్ పొందాడు. రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ వంటి గొప్ప టెన్నిస్ తారలను అధిగమించేందుకు ఒక సువర్ణ అవకాశం లభించింది.

యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్ మ్యాచ్ 5 సెట్ల వరకు కొనసాగింది. జకోవిచ్.. అలెగ్జాండర్ జెరోవ్‌తో తలపడ్డాడు. ఈ పోరులో 4-6, 6-2, 6-4, 4-6, 6-2తో గెలిచాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జకోవిచ్ టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రస్తుతం 21 వ గ్రాండ్‌స్లామ్ విజయంపై దృష్టి నిలిపాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత జొకోవిచ్ తన ప్రత్యర్థి అలెగ్జాండర్ జిరోవ్‌ని ప్రశంసించాడు. జిరోవా తెలివైనవాడని కొనియాడాడు. కోర్టులో నేను ఆరాధించే ఆటగాళ్లలో జిరోవా కూబా ఒకడు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ నాకు అంత సులభంగా మాత్రం విజయం దక్కలేదని తెలిపాడు.

ఫెదరర్, నాదల్‌ రికార్డులను దాటేందుకు అవకాశం ప్రస్తుతం, ఫెదరర్, నాదల్ వారి పేర్లతో 20 గ్రాండ్ స్లామ్ విజయాలు ఉన్నాయి. ఫెదరర్, నాదల్ ప్రస్తుతం టెన్నిస్‌కు దూరంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడం ద్వారా ఫెదరర్, నాదల్‌ని దాటేందుకు జొకోవిచ్‌కు సువర్ణావకాశం వచ్చింది. సెమీ ఫైనల్స్ గెలిచిన తరువాత, నోవాక్ మాట్లాడుతూ “మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. నేను ఈ మ్యాచ్‌పై నా హృదయం, ఆత్మ, శరీరం, మనస్సును కేంద్రీకరించాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్ నా కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆదివారం సూపర్ ఫైనల్.. యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ ఆదివారం జరుగుతుంది. దీనిలో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, ప్రపంచ నంబర్ టూ రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్‌తో తలపడతాడు. సెమీ ఫైనల్స్‌లో 21 ఏళ్ల కెనడియన్ టెన్నిస్ ప్లేయర్‌ని మెద్వెదేవ్ ఓడించి ఫైనల్ చేరాడు. నోవాక్ జొకోవిచ్ ఇప్పటివరకు 3 సార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈసారి గెలిస్తే అతనికి నాల్గవ టైటిల్ అవుతుంది.

Also Read:

IPL 2021: మాంచెస్టర్ నుంచి దుబాయ్ వెళ్లనున్న విరాట్ కోహ్లీ, సిరాజ్.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?

IPL 2021: అద్భుతమైన సిరీస్‌కు దురదృష్టకర ముగింపు.. అభిమానులారా క్షమించండి: భారత నయావాల్ భావోద్వేగ ట్వీట్