IPL 2021: అద్భుతమైన సిరీస్‌కు దురదృష్టకర ముగింపు.. అభిమానులారా క్షమించండి: భారత నయావాల్ భావోద్వేగ ట్వీట్
మొదలు కాకుండానే మాంచెస్టర్ టెస్ట్ రద్దైంది. ఇంగ్లండ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు షెడ్యూల్ కంటే ముందుగానే ఐపీఎల్ 2021 లో భాగంగా యూఏఈకి వెళ్తున్నారు.
Indian Cricket Team: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఓవల్‌లో విజయం కోసం 14 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. భారత జట్టు చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను ట్రోఫిని అందుకోవాలని ఆశపడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మాంచెస్టర్‌లో జరగాల్సి ఉంది. కానీ, భారత శిబిరంలో ఐదవ కరోనా కేసు బయటపడడంతో తొలిరోజునే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటనలు జారీ చేశాయి. మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అభిమానులు కూడా తమ కోపాన్ని, నిరాశను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ సిరీస్‌తో సంబంధం ఉన్న ఏ క్రికెటర్ కూడా స్పందిచలేదు. భారత బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా ఈ విషయంలో మౌనాన్ని వీడారు. మ్యాచ్ రద్దుపై తన స్పందనను వ్యక్తం చేశారు.
భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. సెప్టెంబర్ 10 శుక్రవారం నాడు టెస్ట్ రద్దు అయిన తర్వాత అర్థరాత్రి ట్వీట్ చేసి, తన విచారం వ్యక్తం చేశాడు. పుజారా తన ట్వీట్‌లో “ఈ అద్భుతమైన సిరీస్‌కు దురదృష్టకరమైన ముగింపు. మాంచెస్టర్‌కు వచ్చిన అభిమానులారా క్షమించండి. ఇది ఒక చిరస్మరణీయ పర్యటన. ఈ సిరీస్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. జట్టు గర్వించదగిన ప్రదర్శన చేశాం” అంటూ రాసుకొచ్చాడు.
సీఎస్‌కేలో చేరనున్న పుజారా.. టీమిండియాలోని చాలా మంది సభ్యుల మాదిరిగానే పుజారా కూడా ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ కోసం యూఏఈకి నేరుగా బయలుదేరబోతున్నాడు. కానీ, అతను ఇప్పుడు నిర్ణీత సమయానికి ముందే దుబాయ్ చేరుకుని తన ఫ్రాంచైజీలో చేరనున్నాడు. చాలా కాలం తర్వాత పుజారాకు ఐపీఎల్‌లో అవకాశం లభించింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ప్రారంభ మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించలేదు. కానీ, పుజారా తిరిగి జట్టులో చేరడానికి ఆసక్తిగా ఉన్నాడు. “ఇప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఎంతగానో వేచి చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
దుబాయ్‌లో 6 రోజుల క్వారంటైన్ చెన్నై సూపర్ కింగ్స్ టీం తమ ఆటగాళ్లను ఇంగ్లండ్ నుంచి శనివారం దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. పుజారా కాకుండా, భారత ఆటగాళ్లలో శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మొయిన్ అలీ, సామ్ కర్రన్ కూడా సీఎస్‌కేలో భాగంగా ఆడనున్నారు. చార్టర్డ్ విమానాలు లేకపోతే కమర్షియల్ విమానాల ద్వారా యూఏఈకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. యూఏఈకి చేరుకున్న తర్వాత ఆటగాళ్లను 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.
Unfortunate end to what has been a wonderful series. Feel for the fans who had travelled to Manchester.
Been a memorable tour – lot of learnings & a performance the group can be really proud off! ??
Look forward to getting into the yellow gear 🙂#IndVsEng #Tourdiaries #CSK pic.twitter.com/w7kfF5mU3m
— cheteshwar pujara (@cheteshwar1) September 10, 2021
Also Read: Ind vs Eng: చివరి టెస్ట్ రద్దుతో ఇంగ్లీష్ మీడియా ఓవర్ యాక్షన్.. భారత్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు..!