AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 ప్రపంచ కప్‌ జట్టులో పేరు లేదు.. అయినా కీలక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ పరువు కాపాడిన స్టార్ బ్యాట్స్‌మెన్

బుధవారం బంగ్లాదేశ్‌తో సిరీస్ కోల్పోయిన తర్వాత న్యూజిలాండ్ తమ విశ్వసనీయతను కాపాడుకోవడానికి చివరి టీ 20లో ఓదార్పు విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-3 తేడాతో ఓడిపోయింది.

టీ20 ప్రపంచ కప్‌ జట్టులో పేరు లేదు.. అయినా కీలక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ పరువు కాపాడిన స్టార్ బ్యాట్స్‌మెన్
Bangladesh Vs New Zealand
Venkata Chari
|

Updated on: Sep 11, 2021 | 8:44 AM

Share

Bangladesh vs New Zealand: బంగ్లాదేశ్‌తో సిరీస్ కోల్పోయిన తర్వాత, న్యూజిలాండ్ ఐదవ, చివరి టీ 20 మ్యాచ్‌లో 27 పరుగుల విజయంతో ఓదార్పు విజయాన్ని నమోదు చేసి, తమ పరువును కాపాడుకుంది. న్యూజిలాండ్ విజయంలో దాని స్టార్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ (41 పరుగులు), టామ్ లాథమ్ కీలక పాత్ర పోషించారు. వారు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో కివీస్ విజయం సాధించింది. ఈ సిరీస్‌ను బంగ్లాదేశ్ 3-2తో గెలుచుకుంది.

ప్రపంచ కప్ జట్టులో తనను ఎంపిక చేయని సెలెక్టర్లకు ఫిన్ అలెన్ తన ఇన్నింగ్స్‌తో గట్టిగా సమాధానమిచ్చాడు. గురువారం, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు యూఏఈలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించింది. ఇందులో ఫిలిప్ పేరు చేర్చబడలేదు. టీం సెలక్షన్ జరిగిన ‎ఒకరోజు తరువాత ఫిలిప్ తన ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు తగిన సమాధానం చెప్పాడు. న్యూజిలాండ్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆడమ్ మిల్నేను 16 వ ఆటగాడిగా రిజర్వ్ ప్లేయర్‌గా జట్టులో చేర్చారు. టెస్ట్ అరంగేట్రంలో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించిన డెవాన్ కాన్వే కూడా జట్టులో చోటు సంపాధించాడు. కైల్ జమీసన్ కూడా జట్టులో చేరాడు. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌ని కూడా పొట్టి ప్రపంచ కప్‌ జట్టులో ఉంచారు.

ఘనమైన ఆరంభాన్ని అందించిన అలెన్ మ్యాచ్ విషయానికి వస్తే.. రచిన్ రవీంద్రతో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కివీస్ జట్టు విజయానికి అలెన్ పునాది వేశాడు. అలెన్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ జోడీ తర్వాత, లాథమ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. హెన్రీ నికోలస్ అతనికి మద్దతు అందించాడు. ఈ కారణంగా, న్యూజిలాండ్ 20 ఓవర్ల తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తరఫున షోరిఫుల్ రెండు వికెట్లు తీశాడు.

ఈ సిరీస్‌లో కివీ జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అఎజాజ్ పటేల్ మరోసారి తన సత్తా చాటాడు. అతను లిట్టన్ దాస్, నూరుల్ హసన్ వంటి కీలక వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున అఫిఫ్ హుస్సేన్ 49 పరుగులు చేశాడు. అయితే జట్టు విజయం కోసం ఈ ఇన్నింగ్స్ సరిపోలేదు. మహ్మద్ నయీమ్ (23), మహ్మదుల్లా మాత్రమే 20 కి పైగా పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ జట్టు మొత్తం 134 పరుగులకు ఆలౌట్ అయింది.

సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. అంతకుముందు, బంగ్లాదేశ్ నాలుగో టీ 20 లో న్యూజిలాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ టీం న్యూజిలాండ్‌తో తొలిసారిగా టీ 20 సిరీస్‌ను గెలుచుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 93 పరుగులకు కుదించారు. బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్ అజేయంగా 43 పరుగులు చేసి నాలుగో టీ 20 మ్యాచ్‌లో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాడు.

Also Read:

India Vs England: ”ట్రోఫీ తెస్తారనుకుంటే.. ఇదేంటి మాస్టారూ” టీమిండియాను ఏకిపారేస్తున్న నెటిజన్లు.!

అమెరికాలో క్రికెట్ సందడి.. 7 టీమ్స్.. 10 రోజులు.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్.. ఎప్పటినుంచంటే.!

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!