IPL 2021: మాంచెస్టర్ నుంచి దుబాయ్ వెళ్లనున్న విరాట్ కోహ్లీ, సిరాజ్.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?

Virat Kohli: ఐపీఎల్ 2021 రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అబుదాబిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.

IPL 2021: మాంచెస్టర్ నుంచి దుబాయ్ వెళ్లనున్న విరాట్ కోహ్లీ, సిరాజ్.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Sep 11, 2021 | 9:44 AM

IPL 2021: మాంచెస్టర్ టెస్టు రద్దయిన వెంటనే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈకి రప్పించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తన ఇద్దరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈరోజు (శనివారం) రాత్రి చార్టర్ ఫ్లైట్ ద్వారా మాంచెస్టర్ నుంచి దుబాయ్ వెళ్తారు. దుబాయ్ చేరుకున్న తర్వాత, ఇద్దరూ టీమ్‌తో చేరడానికి ముందు 6 రోజుల క్వారంటైన్‌లో ఉంటారు. ఈ మేరకు ఏఎన్‌ఐతో ఆర్‌సీబీ సభ్యులు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

“అవును, విరాట్, సిరాజ్ కోసం చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేశాం. ఈ ఇద్దరు ఆటగాళ్లు శనివారం రాత్రి 11.30 గంటలకు మాంచెస్టర్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం దుబాయ్ చేరుకుంటారు. వారిని సురక్షితంగా దుబాయ్‌కు తీసుకురావడమే మా లక్ష్యం. దుబాయ్ చేరుకున్న తర్వాత వారు 6 రోజుల క్వారంటైన్‌లో ఉంటారని” ఆర్‌సీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 14 వ సీజన్ రెండవ దశ యూఏఈలో జరుగుతోంది. మొదటి 29 మ్యాచ్‌లు భారతదేశంలో జరిగాయి. ఆ తర్వాత కరోనా కారణంగా టోర్నమెంట్‌ని యూఏఈకి తరలించారు.

ఐపీఎల్ 2021 రెండో దశ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అబుదాబిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత, ఐపీఎల్ 2021లో మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 24 న షార్జాలో జరగనుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 2021 రెండో దశలో 13 మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. షార్జాలో 10 మ్యాచ్‌లు జరుగుతాయి. 8 అబుదాబిలో జరగనున్నాయి. లీగ్ రెండవ దశ కోసం బీసీసీఐ ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం 46 పేజీల బుక్‌ను విడుదల చేసింది. ఇది ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి అనుసరించాలని పేర్కొంది.

ఇతర బృందాలు కూడా.. ఆర్‌సీబీ లాగానే, ఇతర జట్లు కూడా తమ ఆటగాళ్ల కోసం చార్టర్ విమానాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో మాంచెస్టర్ నుంచి యూఏ‌ఈకి ఆటగాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ నుంచి యూఏఈ చేరుకోవాల్సి ఉంది. కానీ, భారత శిభిరంలో కరోనా కలకలంతో మొత్తం మారిపోయింది. ముందుగానే ఆటగాళ్లు యూఏఈ చేరుకోనున్నారు.

Also Read: IPL 2021: అద్భుతమైన సిరీస్‌కు దురదృష్టకర ముగింపు.. అభిమానులారా క్షమించండి: భారత నయావాల్ భావోద్వేగ ట్వీట్

Ind vs Eng: చివరి టెస్ట్ రద్దుతో ఇంగ్లీష్ మీడియా ఓవర్ యాక్షన్.. భారత్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు..!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..