Neeraj Chopra: మరో చిరకాల కోరిక తీర్చుకున్న నీరజ్ చోప్రా.. తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూసి పొంగిపోయాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

Neeraj Chpra: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా శనివారం తన తల్లిదండ్రుల చిన్న కోరికను తీర్చాడు. దీంతో వారి కళ్లలో ఆనందం చూసి పొంగిపోయాడు.

Neeraj Chopra: మరో చిరకాల కోరిక తీర్చుకున్న నీరజ్ చోప్రా.. తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూసి పొంగిపోయాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?
Neeraj Chopra
Follow us
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 11, 2021 | 4:35 PM

Neeraj Chopra: అథ్లెటిక్స్‌లో భారతదేశపు ఏకైక ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా.. తన తల్లిద్రండుల చిరకాలపు కోరికను నెరవేర్చాడు. వారిని మొదటిసారి విమానంలో తీసుకెళ్లి ఆనందంతో పొంగిపోయాడు. 23 ఏళ్ల స్టార్ జావెలిన్ త్రోయర్ ట్విట్టర్‌లో ఈమేరకు ఓ ట్వీట్ చేశాడు. తన తల్లిదండ్రులతో కలిసి విమానం ఎక్కినట్లు ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. “నా తల్లిదండ్రులను మొదటిసారి విమానంలో తీసుకెళ్లగలిగాను. నా చిరకాల కోరిక నెరవేరింది” అని నీరజ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో అభిమానులు స్టార్ ఇండియన్ అథ్లెట్ మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపించారు

“ఈ ఫొటోలను సేవ్ చేయండి. మీరు నిరాశకు గురైనప్పుడు, నిరుత్సాహపడినప్పుడు ఈ ఫొటోలను చూడండి. వీటినుంచి తిరిగి ప్రేరణను పొందండి” అని ఒక అభిమాని కామెంట్ చేయగా, “ఇది చాలా అందంగా ఉంది! మీరు ఉన్నత స్థాయికి చేరుకుని మీ కలలన్నింటినీ నెరవేర్చుకోండి” అంటూ మరొకరు కామెంట్ చేశారు.

టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ ఫైనల్‌లో నీరజ్ 87.58 మీటర్లు విసిరి ఒలింపిక్ స్వర్ణం సాధించాడు. అయితే, అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి స్టార్ అథ్లెట్‌గా మారిపోయాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి పెద్ద ఈవెంట్‌లలో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

“టోక్యో నుంచి తిరిగొచ్చిన తరువాత అనారోగ్యం కారణంగా నేను శిక్షణను తిరిగి ప్రారంభించలేకపోయాను. నా టీమ్‌తో పాటు, 2021 కాంపిటీషన్ సీజన్‌కి కొంత సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. 2022 లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో రాణించేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాం” అని నీరజ్ తెలిపాడు.

Also Read: IND vs ENG: కేఎల్ రాహుల్- రిషబ్ పంత్‌లు సెంచరీలు.. అయినా భారత్ ఘోర పరాజయం.. ఎప్పుడో తెలుసా?

చిన్న లక్ష్యాన్ని చేధించలేక కుప్ప కూలిన జట్టు.. ఇన్నింగ్స్‌లో కేవలం 3 బౌండరీలు.. 20 ఓవర్లు ఆడకుండానే ఓటమి

US Open: యూఎస్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్.. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్‌ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్..!