IND vs ENG: కేఎల్ రాహుల్- రిషబ్ పంత్‌లు సెంచరీలు.. అయినా భారత్ ఘోర పరాజయం.. ఎప్పుడో తెలుసా?

IND vs ENG: ఈ మ్యాచ్‌తో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. కానీ, ఈ ఇద్దరు బ్యాట్స్‌మన్‌లు చేసిన పోరాటం ఇంగ్లండ్ బౌలర్లను కలవరపెట్టింది.

IND vs ENG: కేఎల్ రాహుల్- రిషబ్ పంత్‌లు సెంచరీలు.. అయినా భారత్ ఘోర పరాజయం.. ఎప్పుడో తెలుసా?
Kl Rahul And Pant
Follow us
Venkata Chari

|

Updated on: Sep 11, 2021 | 12:24 PM

IND vs ENG: క్రికెట్‌లో ఇలాంటి మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. ఆటగాళ్ల ఉత్తమ ప్రయత్నాల తర్వాత కూడా జట్టు గెలవలేకపోయింది. బ్యాట్స్‌మెన్‌లు తమ ఉత్తమ ఇన్నింగ్స్‌ ఆడారు. కానీ, జట్టులోని ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఓటమిపాలైంది. ఈ రోజు అంటే సెప్టెంబర్ 11 న, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 2018 ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఓవల్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 118 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ, ఓడిపోయే ముందు, ముఖ్యంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తీవ్రంగా పోరాడారు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 423 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ విజయానికి 464 పరుగులు అవసరం. కేవలం రెండు పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ స్కోర్‌లో, చెతేశ్వర్ పుజారా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రాహుల్‌తో పాటు అజింక్య రహానే జట్టును 100 పరుగులు దాటించాడు. అనంతరం రహానె 37 పరుగుల వద్ద పెవలియన్ చేరాడు. హనుమ విహారి కూడా ఖాతా తెరవలేకపోయాడు. దీంతో టీమిండియా స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

బ్రిటీష్ బౌలర్లకు తలనొప్పిగా మారిన రాహుల్, పంత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీమిండియాకు రాహుల్, పంత్ భాగస్వామ్యం కాస్త ఊరటనిచ్చింది. ఇంగ్లీష్ బౌలర్ల వార్తలను తీసుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ సహనంతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ భారత్ కోసం 204 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. చివరి రోజు ఈ భాగస్వామ్యం టీమిండియా మ్యాచ్‌ని కాపాడటంలో విజయవంతమవుతుందని అనిపించారు. కానీ, లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ రాహుల్‌ను బౌల్డ్ చేసి భారత ఆశలను దెబ్బతీశాడు. 224 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 149 పరుగులు చేశాడు. రాహుల్ నిష్క్రమణ తర్వాత కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన పంత్.. రషీద్‌ పెవిలియన్ చేరాడు. పంత్ 146 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 114 పరుగులు చేశాడు. ఇక్కడే భారత ఓటమి నిర్ణయించబడింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 345 పరుగులు మాత్రమే చేసింది.

అలెస్టర్ కుక్ చివరి మ్యాచ్ ఈ మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్‌కు చివరి మ్యాచ్. ఈ సిరీస్ తర్వాత, అతను క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్‌లో కుక్ బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. సిరీస్‌ను 4-1తో గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. చివరి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కుక్ 71 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు సాధించాడు.

Also Read: చిన్న లక్ష్యాన్ని చేధించలేక కుప్ప కూలిన జట్టు.. ఇన్నింగ్స్‌లో కేవలం 3 బౌండరీలు.. 20 ఓవర్లు ఆడకుండానే ఓటమి

US Open: యూఎస్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్.. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్‌ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్..!

IPL 2021: మాంచెస్టర్ నుంచి దుబాయ్ వెళ్లనున్న విరాట్ కోహ్లీ, సిరాజ్.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?