AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Football Club: హైదరాబాద్ యువకుడికి గోల్డెన్ ఛాన్స్.. హెచ్‌ఎఫ్‌సీలో దక్కిన చోటు

Hyderabad FC :హెచ్‌ఎఫ్‌సీతో ప్రొఫెషనల్ నిబంధనలపై సంతకం చేసిన మొట్టమొదటి హైదరాబాదీ ఆటగాడిగా మారిన ఈ యువకుడు, 2014 లో చిన్న వయస్సులోనే సెన్‌రాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌ (లండన్)తో ప్రారంభించి సండే లీగ్ ఫుట్‌బాల్‌లో పాల్గొన్నాడు.

Hyderabad Football Club: హైదరాబాద్ యువకుడికి గోల్డెన్ ఛాన్స్.. హెచ్‌ఎఫ్‌సీలో దక్కిన చోటు
Abhinav Mulagada
Venkata Chari
|

Updated on: Sep 11, 2021 | 1:41 PM

Share

Abhinav Mulagada: యువతపై తమ దృష్టిని కొనసాగిస్తూ, హైదరాబాద్ ఎఫ్‌సి రిజర్వ్ టీమ్ కోసం నగరంలో జన్మించిన గోల్ కీపర్ అభినవ్ ములగడను ఎంపిక చేసినట్లు క్లబ్ శనివారం ప్రకటించింది. ప్రతిభావంతులైన స్థానిక యువకుల అభివృద్ధికి వేదికను అందించే లక్ష్యంతో ఏప్రిల్‌లో నిర్వహించిన స్థానిక ట్రయల్స్‌లో అభినవ్‌ ప్రతిభను గుర్తించిన హెచ్‌ఎఫ్‌సీ, 16 ఏళ్ల యువకుడితో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది.

“అందరి యువకుల్లాగే, నేను నా స్వస్థలం నుంచి హైదరాబాద్ ఎఫ్‌సీ వంటి పెద్ద క్లబ్ కోసం ఆడాలని ఎప్పుడూ కోరుకునేవాడిని. పిచ్‌పై డెలివరీ చేయడానికి నేను ఆతృతగా ఉన్నాను. ఈ రంగులను ధరించడం గౌరవంగా ఉంది” అని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత అభినవ్ తెలిపాడు.

హెచ్‌ఎఫ్‌సీతో ప్రొఫెషనల్ నిబంధనలపై సంతకం చేసిన మొట్టమొదటి హైదరాబాదీ ఆటగాడిగా మారిన ఈ యువకుడు, 2014 లో చిన్న వయస్సులోనే సెన్‌రాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌ (లండన్)తో ప్రారంభించి సండే లీగ్ ఫుట్‌బాల్‌లో పాల్గొన్నాడు. అతను లండన్‌లోని లేటన్ ఓరియంట్ అకాడమీలో కూడా శిక్షణ తీసుకున్నాడు. దానికి ముందు చెల్సియా అకాడమీ యూ15 ల వద్ద ఆరు నెలలు 2016, 2017 లో ప్రముఖ ఫుట్ బాల్  క్రీడాకారుడు వైవెస్ మా-కలాంబే వద్ద కోభామ్ ట్రైనింగ్ గ్రౌండ్‌లో శిక్షణ పొందారు.

Also Read: Neeraj Chopra: తన చిరకాల కోరిక తీర్చుకున్న నీరజ్ చోప్రా.. తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూసి పొంగిపోయాడు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

IND vs ENG: కేఎల్ రాహుల్- రిషబ్ పంత్‌లు సెంచరీలు.. అయినా భారత్ ఘోర పరాజయం.. ఎప్పుడో తెలుసా?

చిన్న లక్ష్యాన్ని చేధించలేక కుప్ప కూలిన జట్టు.. ఇన్నింగ్స్‌లో కేవలం 3 బౌండరీలు.. 20 ఓవర్లు ఆడకుండానే ఓటమి