FIFA World Cup 2022: ఫిఫా ఫైనల్‌‌కు ముందు.. ట్రెండవుతోన్న ఎస్‌బీఐ పాస్‌బుక్.. ఎందుకో తెలుసా?

SBI Passbook: అర్జెంటీనా ఫైనలిస్ట్ జట్టుగా చోటు సంపాదించిన తర్వాత సోషల్ మీడియా, ముఖ్యంగా భారతదేశంలోని అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఎందుకంటే భారత్‌లోనూ అర్జెంటీనా మద్దతుదారులున్నారు.

FIFA World Cup 2022: ఫిఫా ఫైనల్‌‌కు ముందు.. ట్రెండవుతోన్న ఎస్‌బీఐ పాస్‌బుక్.. ఎందుకో తెలుసా?
Fifa World Cup 2023

Updated on: Dec 17, 2022 | 9:14 AM

ప్రపంచ క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఈ ఏడాది నవంబర్ 20న ప్రారంభమైంది. మొత్తంగా ఫిఫా సమరం చివరకు చేరింది. ఈ క్రమంలో ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ డిసెంబర్ 18న జరగనుంది. ఖతార్ జాతీయ దినోత్సవం రోజున లుసైల్ స్టేడియంలో ట్రోఫీని గెలుచుకునేందుకు అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు సిద్ధమయ్యాయి.

ఈ నెల రోజుల పాటు జరిగిన ఈవెంట్‌లో ఎన్నో సంఘటనలు సోషల్ మీడియా సందడి చేశాయి. ఎట్టకేలకు తొలి మ్యాచ్‌లో ఓడిన అర్జెంటీనా.. ఫైనలిస్ట్ జట్టుగా సీటు పొందిన తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా భారతదేశంలోనూ అభిమానులు కూడా అర్జెంటీనా దేశానికి మద్దతుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఫిఫా సందడి భీకరంగా సాగుతోన్న ఈసమయంలో.. భారత్‌లోని అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ పాస్‌బుక్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కాగా, పాస్‌బుక్ కవర్ నీలం, తెలుపు చారలతో రెండు నీలం ప్యానెల్‌ల మధ్య శాండ్‌విచ్ చేసిన తెల్లటి ప్యానెల్‌పై నలుపు రంగులో రాసిన బ్యాంక్ పేరు, లోగోతో ఉంటుందనే సంగతి తెలిసిందే.

అర్జెంటీనా ఆటగాళ్ల జెర్సీ కూడా..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఎస్‌బీఐ పాస్‌బుక్.. అర్జెంటీనా జెర్సీ రెండూ ఒకే రంగులో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య కలర్ ఒకేలా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఎస్‌బీఐ పాస్‌బుక్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

మూడవసారి ట్రోఫీని గెలుచుకునే అవకాశం..

అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో పోరాడేందుకు సిద్ధమైంది. ఇక ఫైనల్ పోరు కోసం ప్రపంచం అంతా సిద్ధమైంది. అందుకోసం భారత్‌లోని అభిమానులంతా ఫిఫాకు లింక్ చేస్తూ SBI పాస్‌బుక్ పలు చిత్రాలను పంచుకుంటున్నారు.

ఇక్కడ కొన్ని ట్వీట్లను చూద్దాం..

“అర్జెంటీనా ఓడిపోతే భారతీయులు తమ డబ్బు మొత్తాన్ని పోగొట్టుకుంటారని భావిస్తారు” అని ఒక వినియోగదారు ట్వీట్ చేశాడు.

“అర్జెంటీనాకు ఎస్‌బీఐ అధికారిక భాగస్వామి అనుకుంటా. భారతీయులు కూడా ఆ జట్టుకు పెద్ద అభిమానులు కావడానికి కారణం ఇదే కావొచ్చు” అని మరొకరు చమత్కరించారు.

“SBI లంచ్ సమయం = అర్జెంటీనా మ్యాచ్” అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

2014 ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమిని చవిచూసిన మెస్సీ, 1978, 1986లో గెలిచిన టైటిల్‌ను జోడించి అర్జెంటీనాకు మూడో టైటిల్‌ను అందించింది. తన మొదటి ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా తన అసాధారణ కెరీర్‌కు ముగింపు పలకాలని మెస్సీ తహతహలాడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..