AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాకు ఏమాత్రం తీసిపోనిది ఈ ప్లేయర్ స్టోరీ.. బింద్రా-నీరజ్‌లే కాదు.. దేశానికి తొలి ‘గోల్డ్ మెడల్’ అందించిన ఈ హీరో కథ వింటే కన్నీళ్లాగవ్..!

Murlikant Petkar: 2018లో కేంద్ర ప్రభుత్వం మురళీ పేట్కర్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1975లో మహారాష్ట్ర నుంచి శివ్ ఛత్రపతి అవార్డును కూడా పేట్కర్ అందుకున్నాడు.

సినిమాకు ఏమాత్రం తీసిపోనిది ఈ ప్లేయర్ స్టోరీ.. బింద్రా-నీరజ్‌లే కాదు.. దేశానికి తొలి 'గోల్డ్ మెడల్' అందించిన ఈ హీరో కథ వింటే కన్నీళ్లాగవ్..!
Murlikant Petkar
Venkata Chari
|

Updated on: Nov 23, 2021 | 11:13 AM

Share

Murlikant Petkar: భారతదేశ ఒలింపిక్ చరిత్రలో అభినవ్ బింద్రాకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించాడు. అభిమానులు ఆయనపై ఎంతో ప్రేమ, గౌరవం చూపించారు. అభినవ్ బింద్రా కంటే ఎన్నో సంవత్సరాల ముందు, భారతదేశం అదే స్థాయిలో బంగారు పతకం సాధించిందని చాలా తక్కువ మందికి తెలుసు. స్విమ్మింగ్‌లో భారత్‌కు బంగారు పతకాలను మురళీకాంత్ పేట్కర్ అందించాడని మీకు తెలుసా?

ఒలింపిక్ క్రీడలు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేదికగా పరిగణిస్తారమనే విషయం తెలిసిందే. ఒలంపిక్స్ కాకుండా, పారాలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ కూడా అదే స్థాయి క్రీడలు అయినప్పటికీ మన దేశంలో ప్రజలు వాటిని తరచుగా విస్మరిస్తుంటారు. అభినవ్ బింద్రాను పొగిడేవాళ్లకు మురళీ పేట్కర్ పేరు తెలియకపోవడానికి కారణం కూడా ఇదే. అయితే క్రీడా ప్రపంచంలో మాత్రం అభినవ్ బింద్రాకు ఉన్న స్థానమే మురళీకి ఉందనడంలో అతిశయోక్తి కాదు.

పాకిస్థాన్ ఆర్మీ దాడి జీవితాన్నే మార్చేసింది.. పేట్కర్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని పేత్ ఇస్లాంపూర్‌లో నవంబర్ 1947లో జన్మించారు. పెట్కర్ చిన్నప్పటి నుంచి మంచి క్రీడాకారుడిగా రాణించేవాడు. క్రీడల కోసం, అతను సైన్యంలో చేరాడు. బాక్సింగ్ ప్రారంభించాడు. 1965 నాటికి, అతను కాశ్మీర్‌లో జాబ్ చేసేందుకు వెళ్లాడు. మురళీ ఛోటూ టైగర్‌గా ప్రసిద్ధి చెందాడు. 1965 కాశ్మీర్‌లో పాకిస్తానీ వైమానిక దళం దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి అనేక బుల్లెట్లు తగిలాయి. ఆ తర్వాత అతని కాలిపై నుంచి ఒక ట్రక్కు కూడా వెళ్లింది. దీంతో 17 నెలల పాటు కోమాలో ఉన్నాడు. వెన్నెముకలో బుల్లెట్ కారణంగా, అతను నడుము కింద పక్షవాతానికి గురయ్యాడు. కానీ, ఆ తరువాత అతను నడవడం ప్రారంభించాడు. వెన్నుపాములో ఒక బుల్లెట్ అలాగే మిగిలి ఉంది. దానిని ఎప్పటికీ తొలగించలేరు. ఈ ప్రమాదం అతనిని జీవితాంతం వికలాంగుడిని చేసింది. దీని తరువాత అతను చాలా కాలం పాటు INHS అశ్వినిలో చేరాడు. ఈ సమయంలో అతని ఫిజియోథెరపిస్ట్ మళ్లీ ఆడమని సలహా ఇచ్చాడు. పెట్కర్ టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించాడు.

ఎన్‌జీవో‌తో మారిన కథ.. పెట్కర్ నెమ్మదిగా అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయడం ప్రారంభించాడు. ఇది వారికి అంత సులభం కానప్పటికీ, తన ప్రయత్నాలు మాత్ర ఆపలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తరచూ ఇబ్బంది పడేవాడు. ఇంతలో అతను భారత క్రికెట్ కెప్టెన్ విజయ్ మర్చంట్‌తో కలిసిపోయాడు. పెట్కర్ వంటి ఆటగాళ్లకు సహాయపడే NGOను నడిపేవారు. అతను తన NGOతోలో పేట్కర్‌ను చేర్చాడు. విదేశాలకు వెళ్లడానికి అతని టిక్కెట్లను కూడా అందించాడు.

జర్మనీలో చరిత్ర సృష్టించాడు.. మురళీకాంత్ పేట్కర్ 1968 పారాలింపిక్స్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో పాల్గొని మొదటి రౌండ్‌లో గెలిచాడు. మొన్న పారాలింపిక్స్‌లో స్విమ్మింగ్ ఎంచుకుని స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ ఒలింపిక్ క్రీడలు జర్మనీలో జరిగాయి. 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పాల్గొనేందుకు మురళి వెళ్లాడు. 50 మీటర్ల దూరాన్ని ఒంటి చేత్తో ఈదుతూ 37.33 సెకన్లలో పూర్తి చేశాడు. పెట్కర్ గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో, ఇంగ్లండ్‌లో జరిగిన స్టోక్ మాండెవిల్లే ఇంటర్నేషనల్ పారాప్లెజిక్ మీట్‌ల వంటి ఈవెంట్‌లలో దేశం కోసం పతకాలు సాధించడం ద్వారా పేట్కర్ తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు. వరుసగా ఐదు సంవత్సరాలు (1969-73) జనరల్ ఛాంపియన్‌షిప్ కప్‌ను గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

Also Read: IND vs NZ, 1st Test: తొలి టెస్టులో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేది ఎవరు? రహానె-ద్రవిడ్‌ల చూపులో ఉన్నది వారేనా..!

50 మ్యాచుల్లో 20 ఛాన్స్‌లు మిస్.. 2 ఏళ్లుగా విరాట్ కోహ్లీ నిరీక్షణ.. టీమిండియా కెప్టెన్‌‌‌ను ఊరించి, ఉసూరుమనిపిస్తున్నది ఎంటో తెలుసా?