AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 మ్యాచుల్లో 20 ఛాన్స్‌లు మిస్.. 2 ఏళ్లుగా విరాట్ కోహ్లీ నిరీక్షణ.. టీమిండియా కెప్టెన్‌‌‌ను ఊరించి, ఉసూరుమనిపిస్తున్నది ఎంటో తెలుసా?

Virat Kohli: గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ మాత్రం ఓ విషయంతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. కోహ్లీ తన కెరీర్‌లో అంతకుముందు ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

50 మ్యాచుల్లో 20 ఛాన్స్‌లు మిస్.. 2 ఏళ్లుగా విరాట్ కోహ్లీ నిరీక్షణ.. టీమిండియా కెప్టెన్‌‌‌ను ఊరించి, ఉసూరుమనిపిస్తున్నది ఎంటో తెలుసా?
India Vs New Zealand Team India Skipper Virat Kohli (1)
Venkata Chari
|

Updated on: Nov 23, 2021 | 10:00 AM

Share

India Vs New Zealand: రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేశంలో రాష్ట్రాల సమీకరణాలు మారుతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఈ సమయంలో క్రీడా ప్రపంచంలో చాలా కలకలం రేగింది. అయితే గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ మాత్రం ఓ విషయంతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. అదేంటంటే సెంచరీ. అవును.. అంతర్జాతీయ సెంచరీ చేసేందుక నానా తంటాలు పడుతున్నాడు. 23 నవంబర్ 2019న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ తన కెరీర్‌లో అంతకుముందు ఎన్నడూ సెంచరీ కరువును ఎదుర్కోలేదు. అయితే ఈసారి నిరీక్షణకు తెరదించి, అభిమానులను సంతోషపెడతాడో లేదో చూడాలి.

రెండుళ్లుగా ఇబ్బందులు.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే రెండేళ్లు గడిచిపోయాయి. అంటే ప్రస్తుతం మూడవ ఏడాదిలోనూ అదే కనిపిస్తోంది. తన చివరిసారి సెంచరీ చేసినప్పటి నుంచి విరాట్ 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 12 టెస్టులు, 15 ODIలు, 23 T20లు ఉన్నాయి. ఈ సమయంలో, కోహ్లీ 20 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో టెస్ట్‌లలో 5 అర్ధ సెంచరీలు, ODIలలో 8 అర్ధ సెంచరీలు, T20లో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ 20 అర్ధ సెంచరీలను సెంచరీలుగా మార్చడంలో విఫలమయ్యాడు.

గత రెండేళ్లలో 7 సెంచరీలతో రూట్, బాబర్ హవా.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి సెంచరీలు చేయడం మానేసినప్పటి నుంచి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీలతో కదం తొక్కుతున్నారు. విరాట్ తన చివరిసారి సెంచరీ చేసిన తర్వాత.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇద్దరూ తలో 7 సెంచరీలతో దూసుకపోతున్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సెంచరీలు చేయడంలో ముందున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ తలో 4 సెంచరీలను తమ ఖాతాలో వేసుకున్నారు.

గత 2 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసిన చోట, విరాట్ కోహ్లీ పరుగులు చేసినప్పటికీ సెంచరీకి దూరంగానే మిగిలిపోయాడు. గత రెండేళ్లలో ఆడిన 50 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కోహ్లీ 20 అర్ధ సెంచరీలతో సహా 40.59 సగటుతో 1989 పరుగులు చేశాడు. ప్రస్తుతం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అందుబాటులోకి రానున్నాడు. ముంబై‌లో జరిగే రెండో టెస్టులో అయినా సెంచరీతో తన పునరాగమనాన్ని చాటాలని, అలాగే సెంచరీ కోసం నిరీక్షణకు తెర దింపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ముంబైలో విరాట్ కోహ్లీ రికార్డు.. విశేషం ఏమిటంటే.. ముంబైలోని వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆడిన 12 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో 81.36 సగటుతో 895 పరుగులు చేశాడు. అయితే ముంబైలో 4 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. ఒక సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ వాంఖడేలో విరాట్‌కు 5వ టెస్టు‌గా మారనుంది.

Also Read: Watch Video: శ్రేయాస్‌ అయ్యర్ దెబ్బకు పారిపోయిన భారత పేస్ బౌలర్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో

IPL 2022: చెన్నైతో ఆ ప్లేయర్ బంధం ముగిసినట్టేనా? వేలానికి ముందు బిగ్‌‌న్యూస్ చెప్పిన సీఎస్‌కే సీఈవో..!

India Vs New Zealand 2021: సారథిగా మారి బతికిపోయాడు.. లేకుంటే టీమిండియాలో చోటు కష్టమే: గౌతమ్ గంభీర్