AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, 1st Test: తొలి టెస్టులో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేది ఎవరు? రహానె-ద్రవిడ్‌ చూపులో ఉన్నది వారేనా..!

ఈ టెస్టు మ్యాచ్‌కి ముందు టీమిండియాలో రెండు పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి, ఈ టెస్టు సిరీస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మొదటి మ్యాచ్ ఆడడం లేదు.

IND vs NZ, 1st Test: తొలి టెస్టులో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేది ఎవరు? రహానె-ద్రవిడ్‌ చూపులో ఉన్నది వారేనా..!
India Vs New Zealand 1st Test
Venkata Chari
|

Updated on: Nov 23, 2021 | 11:27 AM

Share

India vs New Zealand, 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 25న కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌కి ముందు టీమిండియాలో రెండు పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి, ఈ టెస్టు సిరీస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మొదటి మ్యాచ్ ఆడడం లేదు. హిట్‌మ్యాన్‌కు బదులు ఎవరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారన్నదే ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ చివరి టెస్ట్ సిరీస్‌ను ఆడింది. రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ జట్టుకు ఓపెనింగ్ చేయడం కనిపించింది. అయితే కాన్పూర్‌లో రాహుల్‌తో ఎవరు ఓపెనింగ్ చేయనున్నారనేది సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

రెండు ఎంపికలు.. తొలి టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ రూపంలో ఇద్దరు పోటీదారులు ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గిల్ తన చివరి టెస్టు ఆడాడు. అయితే మయాంక్ ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టు ఆడాడు. గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ జట్టుకు దూరమయ్యాడు. అయితే అగర్వాల్ జట్టులోనే ఉన్నాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో రోహిత్-గిల్, రోహిత్-రాహుల్ బలమైన ప్రదర్శన కారణంగా, అతను ప్లేయింగ్ XIలో అవకాశం పొందలేకపోయాడు.

గిల్ గురించి మాట్లాడతే, గాయపడకముందే అతని ఫామ్ పేలవంగా కనిపించింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి సిరీస్ మినహా, ఇంగ్లండ్, డబ్య్లూటీసీ ఫైనల్‌, అంతకు ముందు జరిగిన హోమ్ సిరీస్‌లో శుభ్‌మన్ ఫామ్‌లో లేడు. ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా, అతను 7 ఇన్నింగ్స్‌లలో 19.83 సాధారణ సగటుతో 119 పరుగులు చేశాడు.ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో 36 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో, మయాంక్ ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారతదేశంలో ఆడిన 5 టెస్ట్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో, అతని బ్యాట్‌తో 99.50 సగటుతో 243 పరుగులు సాధించాడు. ఇద్దరి గణాంకాల ఆధారంగా, ఓపెనింగ్‌లో మయాంక్ అగర్వాల్ బలంగా కనిపిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో కేఎల్ రాహుల్ భాగస్వామిగా న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్టులో మయాంక్ ఓపెనింగ్ చేయడాన్ని మనం చూడొచ్చు.

కెప్టెన్ అజింక్యా రహానే, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల ముందు మరో ప్రశ్న కూడా ఉంది. కోహ్లి స్థానంలో ఎవరు ఉంటారు. అంటే నంబర్-4 కోసం సరైన బ్యాట్స్‌మన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. వాస్తవానికి, విరాట్ కోహ్లి ఈ నంబర్‌లో ఆడుతాడు. కానీ, తొలి టెస్టులో కోహ్తీ లేకపోవడంతో, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి. గిల్ ఓపెనర్ అయినప్పటికీ అవసరమైతే మిడిల్ ఆర్డర్‌లో కూడా ఆడగలడు. కోహ్లి పునరాగమనం చేయడంతో పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైనందున అతని స్థానంలో గిల్ కాస్త బలంగానే కనిపిస్తున్నాడు.

అయితే, శ్రేయాస్ అయ్యర్‌ను కూడా విస్మరించలేం. అయ్యర్ ఒక మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్. వన్డేలలో జట్టు తరపున నంబర్-4లో ఆడుతున్నాడు. శ్రేయాస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై, ఇండియా ఏ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. శ్రేయాస్ అయ్యర్‌కు కాన్పూర్‌లో ఆడే అవకాశం లభిస్తే మాత్రం అది అతడికి తొలి టెస్టు‌గా నిలవనుంది. Also Read: 50 మ్యాచుల్లో 20 ఛాన్స్‌లు మిస్.. 2 ఏళ్లుగా విరాట్ కోహ్లీ నిరీక్షణ.. టీమిండియా కెప్టెన్‌‌‌ను ఊరించి, ఉసూరుమనిపిస్తున్నది ఎంటో తెలుసా?

Watch Video: శ్రేయాస్‌ అయ్యర్ దెబ్బకు పారిపోయిన భారత పేస్ బౌలర్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో