AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PKL 2023: 10 స్టేడియాల్లో 12 జట్ల మధ్య పోరు.. రేపటి నుంచే ప్రో కబడ్డీ లీగ్ జోరు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Pro Kabaddi League 2023 Schedule, Live Streaming: 2014లో ఎనిమిది జట్లతో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ 2019లో పన్నెండు జట్లు చేరాయి. ఇప్పుడు పదో ఎడిషన్‌కు సిద్ధమవుతున్న తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య శనివారం ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ప్రో కబడ్డీ లీగ్ 2023 గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

PKL 2023: 10 స్టేడియాల్లో 12 జట్ల మధ్య పోరు.. రేపటి నుంచే ప్రో కబడ్డీ లీగ్ జోరు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Pkl 2023
Venkata Chari
|

Updated on: Dec 01, 2023 | 5:00 PM

Share

Pro Kabaddi League 2023 Schedule, Live Streaming: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League 2023) 10వ ఎడిషన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 2న టోర్నీ ప్రారంభం కానుంది. భారతదేశంలో, 2014లో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత అత్యధికంగా వీక్షించిన రెండవ స్పోర్ట్స్ లీగ్‌గా పేరుగాంచింది. 2006 ఆసియా క్రీడలలో కబడ్డీ టోర్నమెంట్ ప్రజాదరణతో ప్రభావితమై, ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభించారు.

2014లో ఎనిమిది జట్లతో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌లో 2019 నాటికి పన్నెండు జట్లు ఉన్నాయి. ఇప్పుడు పదో ఎడిషన్‌కు సిద్ధమవుతున్న తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య శనివారం ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ప్రో కబడ్డీ లీగ్ 2023 గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రో కబడ్డీ లీగ్ 2023 షెడ్యూల్:

అహ్మదాబాద్: 2-7 డిసెంబర్ 2023

బెంగళూరు: 8-13 డిసెంబర్ 2023

పూణే: 15-20 డిసెంబర్ 2023

చెన్నై: 22-27 డిసెంబర్ 2023

నోయిడా: 29 డిసెంబర్ 2023 – 3 జనవరి 2024

ముంబై: 5-10 జనవరి 2024

జైపూర్: 12-17 జనవరి 2024

హైదరాబాద్: 19-24 జనవరి 2024

పాట్నా: 26-31 జనవరి 2024

ఢిల్లీ: 2-7 ఫిబ్రవరి 2024

కోల్‌కతా: 9-14 ఫిబ్రవరి 2024

పంచకుల: 16-21 ఫిబ్రవరి 2024

ప్రో కబడ్డీ లీగ్ 2023 వేదికలు:

ట్రాన్స్‌స్టాడియా అహ్మదాబాద్

శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు

పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బ్యాడ్మింటన్ హాల్

SDAT ఇండోర్ స్టేడియం, చెన్నై

నోయిడా ఇండోర్ స్టేడియం, నోయిడా

NSCI, ముంబై

SMS ఇండోర్ స్టేడియం, జైపూర్

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్

పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియం, పాట్నా

త్యాగరాజ్ ఇండోర్ స్టేడియం, ఢిల్లీ

ప్రో కబడ్డీ లీగ్ 2023 జట్లు:

బెంగాల్ వారియర్స్

బెంగళూరు బుల్స్

దబాంగ్ ఢిల్లీ KC

గుజరాత్ జెయింట్స్

హర్యానా స్టీలర్స్

జైపూర్ పింక్ పాంథర్స్

పాట్నా పైరేట్స్

పుణేరి పల్టన్

తమిళ్ తలైవాస్

తెలుగు టైటాన్స్

యు ముంబా

UP యోధాస్

ప్రొ కబడ్డీ లీగ్ 2023 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ప్రో కబడ్డీ లీగ్ 2023 శనివారం (డిసెంబర్ 02) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి నుంచి రెండు నెలల పాటు టోర్నీ కొనసాగనుంది. 21కి ముగుస్తుంది.

ప్రొ కబడ్డీ లీగ్ తొలి మ్యాచ్ ఎప్పుడు?

ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం (డిసెంబర్ 02) ఉదయం 08:00 గంటలకు గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ప్రో కబడ్డీ లీగ్ 2023 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌లు భారతదేశంలో ప్రో కబడ్డీ లీగ్ పదో ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను కలిగి ఉన్నాయి., Disney+Hotstar మొబైల్ యాప్, వెబ్‌సైట్ ప్రొ కబడ్డీ లీగ్ 2023ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..