Video: మను భాకర్, నీరజ్ చోప్రా పెళ్లి చేసుకోబోతున్నారా..? వైరల్ వీడియో..

Neeraj Chopra - Manu Bhaker: షూటర్ మను భాకర్, జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. పారిస్‌లో నీరజ్ భారత్‌కు ఏకైక రజత పతకాన్ని సాధించగా, మను షూటింగ్‌లో డబుల్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరిపైనే తీవ్రమైన చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఇద్దరు కలిసి ఉన్న వీడియో కారణమైంది.

Video: మను భాకర్, నీరజ్ చోప్రా పెళ్లి చేసుకోబోతున్నారా..? వైరల్ వీడియో..
Neeraj Chopra Manu Bhaker
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2024 | 3:45 PM

Neeraj Chopra – Manu Bhaker: షూటర్ మను భాకర్, జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. పారిస్‌లో నీరజ్ భారత్‌కు ఏకైక రజత పతకాన్ని సాధించగా, మను షూటింగ్‌లో డబుల్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరిపైనే తీవ్రమైన చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఇద్దరు కలిసి ఉన్న వీడియో కారణమైంది. ఈ వీడియో పారిస్ ఒలింపిక్స్ తర్వాత జరిగిన వేడుకలో చోటుచేసుకుంది. ఫుటేజీలో, నీరజ్, మను ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా, సిగ్గుపడుతూ మాట్లాడడం కనిపిస్తుంది.

వీరిద్దరి ఎక్స్‌ప్రెషన్స్ చూసిన వారంత తెగ సంబర పడిపోతున్నారు. ఒలింపిక్స్‌లో ధీటుగా పోరాడి పతకాలు గెలిచిన మీరు.. ఇలా సిగ్గుపడుతూ మాట్లాడుకోవడం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఒకరినొకరు చూసుకోకుండా తెగ సిగ్గుపడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, మను భాకర్ తల్లి నీరజ్‌తో మాట్లాడుతున్న వీడియో కూడా షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నీరజ్ చేయి తీసుకొని ఆమె తలపై ఉంచిన దృశ్యాలు కూడా ఇందుకు కారణం అంటూ లింక్ చేస్తున్నారు.

ఆ తర్వాత నీరజ్, మను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. మను తల్లి నీరజ్ మధ్య ఏం చర్చ జరిగిందో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా కోరుకుంటున్నారు.

ఈ విషయమై చర్చలు జోరుగా సాగడంతో ఇప్పుడు మను తండ్రి రామ్ కిషన్ స్పందించారు. పెళ్లిపై వచ్చిన పుకార్లన్నింటినీ కొట్టిపారేశాడు. ‘‘మను చాలా చిన్నది. ఆమెకు పెళ్లి వయసు కూడా లేదు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మను తల్లి నీరజ్‌ని తన సొంత కొడుకులా చూస్తుంది. అదే వారి మధ్య బంధాన్ని, ఆప్యాయతను తెలియజేస్తోంది’’ అంటూ రామ్ కిషన్ అన్నారు.

ఈ నేపథ్యంలో నీరజ్ మామ భీమ్ చోప్రా కూడా స్పందించారు. నీరజ్ పతకం గెలిచింది దేశం మొత్తానికి తెలుసని, నీరజ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో కూడా దేశం మొత్తానికి తెలుస్తుందని తేల్చి చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి వీరిద్దరు చెక్ పెట్టేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..