Thomas Cup 2022: థామస్‌ కప్‌లో తొలి విజయం.. ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఆ ఐదుగురు..

Thomas Cup 2022: థామస్‌ కప్‌లో తొలి విజయం.. ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఆ ఐదుగురు..
Thomas Cup 2022

బ్యాంకాక్‌లో విజయం క్రీడా లోకంలో బ్యాడ్మింటన్ స్థానం ఖాయం చేసింది. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఐదుగురు ధైర్యవంతులైన భారతీయులు..

Venkata Chari

|

May 16, 2022 | 9:59 PM

థామస్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను టీమిండియా తొలిసారి కైవసం చేసుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ విజయం తర్వాత భారత్‌లో క్రికెట్ విప్లవం ఎలా వచ్చిందో.. అదే విధంగా థామస్ కప్ విజయం భారత బ్యాడ్మింటన్‌కు మైలురాయిగా నిలుస్తుంది. చారిత్రాత్మక ప్రదర్శనతో థామస్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-0తో ఇండోనేషియాను ఓడించింది. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా భారత్ ఈ టోర్నీ విజేతగా నిలిచింది. థామస్ కప్‌ను పురుషుల ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ విజయం 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజయాన్ని పోలి ఉందని అంతా అంటున్నారు. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్ లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనీ సినిసుకా గింటింగ్‌ను ఓడించాడు. కాగా, రెండో మ్యాచ్‌లో భారత జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 18-21, 23-21, 21-19తో కెవిన్ సంజయ్ సుకముల్జో, మహ్మద్ అహ్సన్‌లపై విజయం సాధించారు. దీంతో మూడో మ్యాచ్‌లో కిదాంబి 21-15, 23-21తో జోనాథన్ క్రిస్టీపై విజయం సాధించి, భారత్‌కు తొలిసారి థామస్ కప్‌ను అందించారు.

వారు వచ్చారు.. వారు ఆడారు.. చివరకు అందరి హృదయాలను గెలుచుకున్నారు. భారత షట్లర్లు ప్రస్తుతం థామస్ కప్ హోల్డర్లు. దీంతో భారతీయ మనస్తత్వంపై ఉన్న చాలా అపోహలను పడగొట్టారు. లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాత్విక్‌ సాయిరాజ్, రాంకికిరెడ్డి-చిరాగ్ శెట్టి ప్రదర్శించిన దృఢ సంకల్పం ఎంతో గొప్పది. దీంతో ఇండోనేషియాపై భారత్ తిరుగులేని విజయం సాధించింది.

చాలా కాలంగా మనం తెలివిగా లేదా తరచుగా ఈ సందేహాలు మన మనస్సులలో పెంచి పోషించాం. క్రికెట్ తప్ప ఈ దేశంలో వేరే క్రీడకు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదంటూ అంటుంటాం. కానీ, వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. శెట్టి, రాంకిరెడ్డి నాలుగు మ్యాచ్ పాయింట్‌లను కాపాడుకోవడంతో ఘనమైన ఆరంభాన్ని భారత్‌కు అందించారు. ఆ తర్వాత లక్ష్య సేన్ ఫైట్‌బ్యాక్ చేయడం, ఆ తర్వాత కిదాంబి చూపిన అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో అనుమానాలను పటా పంచలు చేశారు.

73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో, కేవలం ఐదు దేశాలు ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకోగలిగాయి. 1979 నుంచి భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన 2010లో జరిగింది. క్వార్టర్-ఫైనల్ దశలో ఇంటికి చేరింది. థామస్ కప్‌లో 14 టైటిల్స్‌తో గుత్తాధిపత్యం సాధించిన ఇండోనేషియాను 3-0తో ఓడించడం ద్వారా వీరు సత్తా చాటి, భారత్ పేరును ప్రపంచ వ్యాప్తంగా చాటారు. కేవలం ఐదుగురు ధైర్యవంతులైన భారతీయులు.. థామస్‌లో సత్తా చాటారు. ఫైనల్‌ ప్రారంభం నుంచే చరిత్రను తిరగరాస్తామని వీరు ప్రకటించారు. ఆంథోనీ గింటింగ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో యువ లక్ష్య సేన్ విజయానికి స్క్రిప్టు రాసి, వీరోచిత ఆటతో ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత మొదటి డబుల్స్ మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ సంకల్పం నిర్ణయాత్మక క్షణం వచ్చింది. భారత ద్వయం రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అధిక ర్యాంక్‌లో ఉన్న ఇండోనేషియా జోడీని ఓడించి, భారత్‌ను ట్రోఫీకి చేరువ చేశారు. ఈ విజయంతో వచ్చిన ఆనందాన్ని చిరాగ్ శెట్టి, రాంకిరెడ్డి ఆపుకోలేకపోయారు. ఛాతీని కొట్టుకుంటూ, కోర్టులో డ్యాన్స్ చేస్తూ, పులుల్లా రెచ్చిపోయారు. వారు జరిపిని వేడుకలను చూస్తుంటే, ఇండోనేషియా అంటే భారతదేశం చరిత్ర సృష్టించడానికి మాత్రమే ఉద్దేశించిందని తెలుస్తుంది.

అంతకుముందు లక్ష్య సేన్ ఓపెనింగ్ ఎన్‌కౌంటర్‌లో ఒక రకమైన అద్భుతాన్ని ప్రదర్శించాడు. అతను మొదటి గేమ్‌లో ఓడిపోయి, రెండో గేమ్‌లో 9-11తో వెనుకంజలో ఉన్నాడు. కానీ, సేన్ సరిగ్గా 9-11 మార్కు వద్ద కొన్ని అద్భుతాలు చేసి, విజయం సాధించాడు. ఇక ఫైనల్ గేమ్ శ్రీకాంత్ ఆడాడు. అతను కోర్టులోకి ప్రవేశించిన క్షణం నుంచి, శ్రీకాంత్ విజయం సాధించే వరకు ఎంతో ఉత్కంఠగా సాగింది.

బ్యాంకాక్‌లో విజయం క్రీడా లోకంలో బ్యాడ్మింటన్ స్థానం ఖాయం చేసింది. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఐదుగురు ధైర్యవంతులైన భారతీయులు, ఎక్కువ మంది ఊహించని సమయంలో గెలిచిన వీరు, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం భారతీయులకు ఆనందాన్ని కలిగించారు. బ్యాడ్మింటన్ ప్రపంచ కప్‌లో ఊహించని విజయంతో భారతదేశానికి ఊరటనిచ్చారు.

Also Read: PBKS vs DC Score: హాఫ్ సెంచరీతో మార్ష్ కీలక ఇన్నింగ్స్.. స్వల్ప స్కోర్‌కే ఢిల్లీ పరిమితం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ఇవి కూడా చదవండి

IPL 2022: కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu