World Boxing Championship: సత్తా చాటిన భారత బాక్సర్లు.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఖాయమైన 2 పతకాలు..
నిఖత్ జరీన్‌తో పాటు మరో ఆరుగురు భారతీయ బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వారి నుంచి భారత్ పతకాలు గెలుస్తుందని భావిస్తున్నారు.
ఒకరోజు క్రితం బ్యాడ్మింటన్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, నేడు బాక్సింగ్ పోటీలో కూడా భారతదేశానికి శుభవార్త వస్తోంది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022(IBA Women’s World Boxing Championship 2022)లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. నిఖత్ జరీన్(Nikhat Zareen) శక్తివంతమైన పంచ్‌ల ద్వారా దేశానికి తొలి పతకం అందించనుంది. వర్ధమాన భారత బాక్సర్ సోమవారం 52 కేజీల క్వార్టర్ ఫైనల్‌లో తన ఇంగ్లండ్ ప్రత్యర్థిని ఏకపక్ష పద్ధతిలో ఓడించి సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈసారి ఛాంపియన్‌షిప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరిన భారతదేశం నుంచి తొలి బాక్సర్‌గా ఆమె నిలిచింది. దీంతో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. అదే సమయంలో 57 కేజీల విభాగంలో మనీషా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌కు రెండో పతకాన్ని అందించనుంది.
Also Read: Women’s IPL 2022 Squad: మహిళల టీ20 ఛాలెంజ్‌కు రంగం సిద్ధం.. ఆ ఇద్దరికి షాకిచ్చిన బీసీసీఐ.. కెప్టెన్‌లుగా ఎవరంటే?
భారతదేశపు దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ స్థానంలో 52 కేజీల స్థానంలో నిలిచిన నిఖత్, తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఆమె అరంగేట్రంలోనే, ఈసారి ఛాంపియన్‌షిప్‌లో తనకు, భారతదేశానికి మొదటి పతకాన్ని నిర్ధారించింది. ఒకరోజు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ప్రత్యర్థిని 5-0తో ఓడించిన నిఖత్, సెమీ-ఫైనల్‌లోనూ అదే ఒరవడిని కొనసాగించి ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ డేవిసన్‌ను పూర్తిగా మట్టికరిపించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న డేవిసన్, నిఖత్ పంచ్‌లకు సమాధానం లేకపోవడంతో, ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్‌కు అనుకూలంగా 5-0తో తీర్పు ఇచ్చారు.
మనీషాకు పతకం ఖాయం..
నిఖత్ తర్వాత, భారతదేశం త్వరలో రెండవ విజయాన్ని అందుకుంది. ఈసారి మనీషా అద్భుతాలు చేసింది. 57 కేజీల విభాగంలో భారత్‌కు సవాలు విసిరిన మంగోలియాకు చెందిన బాక్సర్ నమున్ మోంఖోర్‌పై మనీషా విజయం సాధించింది. ఈ నిర్ణయం పూర్తిగా ఏకపక్షంగా లేనప్పటికీ, నలుగురు న్యాయమూర్తులు మనీషా పంచ్‌లను మరింత ప్రభావవంతంగా, లక్ష్యంగా చేసుకున్నారని భావించారు. భారత బాక్సర్‌కు అనుకూలంగా 4-1తో తీర్పు ఇచ్చారు.
ఓడిపోయిన నీతూ.. ఇతర బాక్సర్లపైనే బాధ్యత..
అంతకుముందు, భారత్‌కు రోజు సరిగ్గా ప్రారంభం కాకపోవడంతో తొలి క్వార్టర్ ఫైనల్‌లో నీతూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆమె 48 కేజీల విభాగంలో భారత్‌కు సవాలు విసిరింది. అయితే ఆమె ప్రస్తుత ఆసియా ఛాంపియన్ కజకిస్తాన్‌కు చెందిన బాల్కిబెకోవా చేతిలో ఓడిపోయింది. 63 కేజీల్లో పర్వీన్, 50 కేజీల్లో అనామిక, 60 కేజీల్లో జాస్మిన్, 81 కేజీల్లో పూజ సహా మరికొందరు బాక్సర్లపై భారత్ ఆశలు పెట్టుకుంది.
WOHOOO! ??
??’s @nikhat_zareen showed ? prowess of attack and defence to pack ???????’s Taylor and secure 1️⃣st medal for ?? at the #IBAWWC2022.
Way to go, champ!?? ? #PunchMeinHaiDum#IstanbulBoxing#Boxing pic.twitter.com/q1eyuTfyus
— Boxing Federation (@BFI_official) May 16, 2022
Also Read: PBKS vs DC Live Score, IPL 2022: టాస్ గెలిచిన పంజాబ్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?