Gopichand: అప్పట్లో థామస్ కప్ గెలుస్తామంటే వాళ్లు చులకనగా నవ్వారు.. పుల్లెల గోెపిచంద్ సంచలన కామెంట్స్

బ్యాడ్మింటన్ పరంగా భారత్ లో మరింత పెద్ద విజయని.. ఎంతగా అంటే.. 1983 క్రికెట్ లో ప్రపంచకప్ విజయం కంటే గొప్పదని తాను చెబుతానని అన్నారు. భారత ఇంత పెద్ద విజయం సాధిస్తామని ఎవరూ ఊహించి ఉండరని అనుకుంటున్నానని అన్నారు గోపీ చంద్.

Gopichand: అప్పట్లో థామస్ కప్ గెలుస్తామంటే వాళ్లు చులకనగా నవ్వారు.. పుల్లెల గోెపిచంద్ సంచలన కామెంట్స్
Gopichand On Thomas Cup
Follow us
Surya Kala

|

Updated on: May 16, 2022 | 8:19 AM

Gopichand on Thomas Cup: మే 15 ఆదివారం రోజున బ్యాంకాక్‌లో 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను (Indonesia) ఓడించి భారత దేశం.. క్రీడాప్రపంచంలో చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌లను వరసగా మూడు గేమ్‌లలో మట్టికరిపించి చరిత్ర సృష్టించారు భారత బ్యాడ్మింటన్ క్రీడారులు. భారత్ తమ మొట్టమొదటి థామస్ కప్‌ను (India Won Thomas Cup) గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠంతో జరిగిన ఫైనల్‌లో.. భారత క్రీడాకారులు.. తమ కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్లను ఓడించి టోర్నీలో విజేతగా నిలిచి..రికార్డ్ సృష్టించారు.  థామస్ కప్ ఫైనల్‌లో  మనదేశానికి చెందిన క్రీడాకారులు  14 సార్లు ఛాంపియన్స్ ఇండోనేషియాను ఓడించి టోర్నమెంట్ గెలుస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే లక్ష్య సేన్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, కిదాంబి శ్రీకాంత్ లు ఆధ్యంతం  ప్రణాళికలతో ఆడారు. ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా అద్భుతమైన ప్రదర్శన చేశారు.

అయితే ఈ విజయం గురించి భారత ప్రధాన జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇది 1983 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయం కంటే పెద్దదని అన్నారు. ఈ విజయం భారతలో బ్యాడ్మింటన్ కు మరింత ఆదరణ పెరుగుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాంత్ , లక్ష్య సేన్, లతో పాటు సాత్విక్, చిరాగ్ లు  అద్భుతమైన ప్రదర్శన చేసినట్లు తాను భావిస్తున్నానని చెప్పారు గోపీచంద్.

బ్యాడ్మింటన్‌ రంగంలో భారత్‌ వేగంగా దూసుకుపోతోందని.. టోర్నీ చరిత్రలో ఊహించని విజయాన్ని అందుకోగలిగామని గోపీచంద్‌ హర్షం వ్యక్తం చేశారు. తాను ఒకప్పుడు భారత్‌ థామస్‌ కప్‌ గెలుస్తుందని చెబితే ప్రజలు నవ్వుకునేవారని గుర్తు చేసుకున్నారు. “బ్యాడ్మింటన్ పరంగా భారత్ లో మరింత పెద్ద విజయని.. ఎంతగా అంటే.. 1983 క్రికెట్ లో ప్రపంచకప్ విజయం కంటే గొప్పదని తాను చెబుతానని అన్నారు. భారత ఇంత పెద్ద విజయం సాధిస్తామని ఎవరూ ఊహించి ఉండరని అనుకుంటున్నానని అన్నారు గోపీ చంద్. ముఖ్యంగా కొన్నాళ్ల క్రితం చైనా, మలేషియా లాంటి బ్యాడ్మింటన్ ఆడే దేశానికి వెళ్లి భారత్ ఎప్పుడో థామస్ కప్ గెలుస్తుందని చెబితే.. వాళ్లు మిమ్మల్ని చూసి నవ్వుకున్నారు. అయితే రోజు రోజుకీ సింగిల్స్ , డబుల్స్ లో మంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు లభించడంతో ఈరోజు చరిత్ర సృష్టించగలిగామని తాను భావిస్తున్నాను, ”అని గోపీచంద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

2022కి ముందు ఐదు దేశాలు మాత్రమే థామస్ కప్‌ను గెలుచుకున్నాయి. దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ వంటి పెద్ద బ్యాడ్మింటన్ దేశాలు కూడా ప్రతిష్టాత్మక థామస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోలేదు. క్వార్టర్ ఫైనల్‌లో 5-సార్లు ఛాంపియన్ మలేషియా, డెన్మార్క్ (థామస్ కప్ గెలిచిన ఏకైక యూరోపియన్ జట్టు)లు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఫైనల్‌లో భారత.. థామస్ కప్ చరిత్రలో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నఇండోనేషియాను ఓడించి..  టోర్నమెంట్‌ను గెలుచుకున్న ఆరో దేశంగా భారత్ నిలిచింది.

‘భారత్‌ ఆ స్థాయికి చేరుకోవడం చాలా పెద్ద విషయంగా తాను భావిస్తున్నానని అన్నారు గోపీచంద్. ఫైనల్ లో తొలి మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. సాత్విక్, చిరాగ్ లు అవతలి జట్టు క్రీడాకారులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచారు. ఇక శ్రీకాంత్ ఆటను చూసినప్పుడు తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. మొత్తానికి జట్టు అంతాకలిసి కలిసి కట్టుగా ఆడారు.. ఈరోజు థామస్ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించినందుకు తనకు చాలా సంతోషముగా ఉందని పుల్లెల గోపీచంద్ చెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..