FIFA World Cup: హీరోగా మారిన గోల్ కీపర్.. పెనాల్టీ షూటౌట్‌లో ఆసియా జట్టుకు భారీ షాక్..
FIFA World Cup 2022 Japan vs Croatia: క్రొయేషియాతో జరిగిన ఫైనల్-16 మ్యాచ్‌లో , జపాన్ జట్టు 120 నిమిషాలకు పైగా పోరాడినా గెలవలేకపోయింది. ఎట్టకేలకు ఈ ప్రపంచకప్‌లో తొలిసారి పెనాల్టీ షూటౌట్‌కు నిర్ణయం తీసున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ 2022లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆసియా జట్టైన జపాన్ ఫుట్‌బాల్ టీం అద్భుతమైన ప్రయాణం హృదయ విదారక ఓటమితో ముగిసింది. క్రొయేషియాతో జరిగిన ఫైనల్-16 మ్యాచ్‌లో , జపాన్ జట్టు 120 నిమిషాలకు పైగా పోరాడినా గెలవలేకపోయింది. ఎట్టకేలకు ఈ ప్రపంచకప్‌లో తొలిసారి పెనాల్టీ షూటౌట్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రోయేషియా జట్టు గోల్‌కీపర్ తన సత్తా చాటుతూ తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
2018 ప్రపంచ కప్‌లోని ఫైనల్-16 మ్యాచ్‌లో యాక్షన్ రీప్లేను చేస్తూ పెనాల్టీ షూట్ అవుట్‌లో క్రొయేషియా మరోసారి తమ విజయవంతమైన రికార్డును కొనసాగించింది. గత ప్రపంచకప్‌లో క్రొయేషియా జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్, క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ల్లో పెనాల్టీలపై విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ జట్టుకు అనుభవం, అవసరమైన మానసిక బలం కూడా ఉంది. జపాన్‌ను 3-1 తేడాతో ఓడించింది.
జపాన్ ముందంజ వేసినా..
టోర్నీ గ్రూప్ దశలో స్పెయిన్, జర్మనీ వంటి మాజీ చాంపియన్ జట్లను ఆశ్చర్యపరిచిన జపాన్ రాణిస్తుందని ఆశించినా నిరాశ తప్పలేదు. అల్ జానౌబ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మరింత పటిష్టంగా ఉన్న క్రొయేషియా జట్టుకు జపాన్ గట్టిపోటీనిచ్చింది. 43వ నిమిషంలో దేజాన్ మైదా గోల్ చేసి జట్టును ఆదుకున్నాడు. అయితే, అతని ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. రెండవ అర్ధభాగంలో 10 నిమిషాల వ్యవధిలో వెటరన్ క్రొయేషియా వింగర్ ఇవాన్ పెరిసిక్ గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు.
గోల్ కీపర్ లివాకోవిచ్ అద్భుతం..
అయితే, ఆ తర్వాత ఇరు జట్ల ప్రతి ప్రయత్నం విఫలం కావడంతో నాకౌట్ రౌండ్‌లో తొలిసారిగా 30 నిమిషాల అదనపు సమయాన్ని నిర్ణయించారు. అయితే ఇక్కడ కూడా ఎవరూ విజయం సాధించకపోవడంతో స్కోరు 1-1తో సమానంగా నిలిచింది. ఇటువంటి పరిస్థితిలో, పెనాల్టీ షూటౌట్ నుంచి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఇక్కడ 27 ఏళ్ల క్రొయేషియా కీపర్ డొమినిక్ లివాకోవిచ్ జపాన్ 3 పెనాల్టీ షాట్లను ఆపడం ద్వారా జట్టును గెలుచుకున్నాడు.
?? Croatia’s hero ??
A hat-trick of penalty saves! ?#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/8MKDVEFhWy
— FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022
జపాన్ మొదటి, రెండవ షాట్‌లను కీపర్ అడ్డుకున్నాడు. అయితే క్రొయేషియా, వారి రెండు షాట్‌లలో స్కోర్ చేసింది. మూడో షాట్‌లో జపాన్ తొలి విజయాన్ని అందుకోగా, ఈసారి క్రొయేషియా ఆటగాడు విఫలమయ్యాడు.
చివరగా, నాల్గవ షాట్‌లో, లివ్కోవిచ్ జపాన్ ప్రయత్నాన్ని అడ్డుకోవడం ద్వారా తన జట్టుకు మంచి అవకాశాన్ని అందించాడు. క్రొయేషియా ఆటగాడు తన షాట్‌ను గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. బ్రెజిల్-దక్షిణ కొరియా మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో క్రొయేషియా క్వార్టర్ ఫైనల్‌లో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..