Tokyo Olympics: ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై కొనసాగుతోన్న సందిగ్ధత… ఈ ఏడాదైనా జరిగేనా.?
Tokyo Olympics: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు...
Tokyo Olympics: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక అన్ని రంగాలపై ప్రభావం చూపిన కరోనా క్రీడా రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా భారీగా పెరుగుతోన్న కేసుల కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది జపాన్ వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఇది అందరికీ తెలిసిందే. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత క్రీడలను ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జూన్‌లో క్రీడలను నిర్వహిస్తామని ప్రకటన కూడా చేశారు. అయితే ఈ ఏడాది కూడా కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రస్తుతం జపాన్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం.. అత్యయిక స్థితిని విధించింది. దీంతో ఈసారైనా ఒలింపిక్ క్రీడలు జరుగుతాయా? అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జపాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: ఆ ఇద్దరి వల్లే ఐపీఎల్ వాయిదా పడిందా..? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..! తెలుసుకోండి..
ఐపీఎల్ ను మాత్రమే కాదు.. ఈ టోర్నమెంట్లను సైతం కరోనా దెబ్బ తీసింది.. అవేంటంటే.!