Koneru Humpy: ఛాంపియన్‌గా కోనేరు హంపి.. 8.5 పాయింట్లతో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం

|

Dec 29, 2024 | 7:52 AM

Koneru Humpy wins World Rapid Championship 2024: ఆదివారం న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ విజేతగా నిలిచింది. 11 రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన ఇరిన్ ఖరిష్మా సుకందర్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

Koneru Humpy: ఛాంపియన్‌గా కోనేరు హంపి.. 8.5 పాయింట్లతో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం
Koneru Humpy
Follow us on

Koneru Humpy wins World Rapid Championship 2024: ఆదివారం న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ విజేతగా నిలిచింది. 11 రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన ఇరిన్ ఖరిష్మా సుకందర్‌ను ఓడించి విజేతగా నిలిచింది. మొత్తంగా 8.5 పాయింట్లతో ఈ టోర్నీలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన హంపీ ఘన విజయం సాధించింది. కాగా, చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఎక్కువసార్లు టోర్నీలో గెలిచిన జాబితాలో హంపి రెండో స్థానంలో నిలిచింది.

హంపీ 2023 సమర్‌కండ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో టైబ్రేక్‌లలో విజేతగా నిలవలేకపోయింది. గత విజేత అనస్తాసియా బోడ్నరుక్‌తో ఓడిపోయింది. అయితే, హంపీ 2019లో మాస్కోలో అగ్రస్థానంతోపాటు విజేతగా నిలిచింది. ఈ తర్వాత హంపీకి ఇది రెండో ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత కారణాల వల్ల భారత్ చారిత్రాత్మక డబుల్ స్వర్ణాన్ని గెలుచుకున్న బుడాపెస్ట్ ఒలింపియాడ్‌లో హంపీ దూరమైంది. అయితే, 2024లో రాపిడ్ టైటిల్‌తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది.

ఈవెంట్‌లో చివరి రౌండ్‌లో హంపీతో పాటు ఆరుగురు క్రీడాకారులు – జు వెన్‌జున్, కాటెరినా లగ్నో, హారిక ద్రోణవల్లి, అఫ్రూజా ఖమ్‌దమోవా, టాన్ జాంగ్యి, ఐరీన్ – 10 రౌండ్లలో 7.5 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందంజలో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..