India Open 2022: లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్(Saina Nehwal) కెరీర్ గత కొన్నేళ్లుగా గాయం ప్రభావంతో మసకబారింది. ఇండియా ఓపెన్(India OPen 2022)లో విజయంతో శుభారంభం చేసిన సైనా.. బుధవారం గాయంపై ఓపెన్‌గా మాట్లాడింది. తన హృదయంలో కూడా ఆట నుంచి రిటైర్మెంట్(Retirement) కావాలనే ఆలోచన వచ్చిందని, అయితే తన శరీరం ఇంకా ఎన్ని గాయాలను తట్టుకోగలదో చూడాలని, దానిని సవాలుగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా గాయాల కారణంగా 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో సహా పలు టోర్నీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా, సైనా ఇండియా ఓపెన్‌లో ఆడుతుందని ఊహించలేదు. కానీ, ఆమె రెండో రౌండ్‌కు చేరుకుని ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రత్యర్థి చెక్ రిపబ్లిక్‌కు చెందిన తెరెజా స్వాబికోవా వెన్నునొప్పి కారణంగా బుధవారం మ్యాచ్‌ను మధ్యలోనే వదిలేసింది. ఆ సమయానికి సైనా 22-20, 1-0తో ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ అనంతరం సౌత్ నటుడు సిద్ధార్థ్‌తో వివాదం గురించి కూడా మాట్లాడింది.
సిద్ధార్ధ్ వివాదంపైనా.. మ్యాచ్ అనంతరం ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సైనా మాట్లాడుతూ, ‘నేను కష్టపడి ప్రాక్టీస్ చేయగలిగాను. కానీ, నా వెన్నుముకలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను థామస్, ఉబెర్ కప్ ఫైనల్ సమయంలోనూ గాయపడ్డాను. కానీ, ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో మోకాలి సమస్య మరింత ఎక్కువైందని నాకు తెలియదు.
సైనా మాట్లాడుతూ, ‘ఆ మ్యాచ్ వరకు, ఈ గాయం ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలియదు. ఆ తర్వాత కుంటుతూనే ఉన్నాను. ఇది ఒక సవాలు. నేను దానిని స్వీకరించాలనుకుంటున్నాను. నా శరీరం ఎలాంటి గాయాలను తట్టుకోగలదో చూద్దాం. ఇది సులభం కాదు. కొన్నిసార్లు మనసు మాట వినడం కుదరకపోవచ్చు. గాయాలు మానేందుకు కోర్టు బయట కూర్చోవడం తనను నిజంగా ఇబ్బంది పెడుతుందని’ సైనా చెప్పుకొచ్చింది. “టోర్నమెంట్లు జరుగుతున్నాయి, ఆటగాళ్ళు గెలుస్తున్నారు. నేను వారి ఆటలను చూస్తూ కూర్చున్నాను. కాబట్టి ఇలా ఉండడం మానసికంగా చాలా కష్టం. ఇది ఒక సవాలు. కానీ, మేం పోరాటాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. బహుశా ముందు కొన్ని మంచి రోజులు ఉండవచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది.
సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పడం సంతోషం.. ఇటీవల భద్రతా ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు నటుడు సిద్ధార్థ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సంతోషంగా ఉందని భారత షట్లర్ సైనా నెహ్వాల్ బుధవారం అన్నారు. పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రతా ఉల్లంఘనలపై ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా చేసిన ట్వీట్‌కు సిద్ధార్థ్ సమాధానం ఇవ్వడంపై వివాదం చెలరేగింది. ఆ నటుడి ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని ట్విటర్ ఇండియాను జాతీయ మహిళా కమిషన్ (NCW) కోరింది. సిద్ధార్థ్ బుధవారం క్షమాపణలు చెప్పాడు. నటుడు తన తప్పును అంగీకరించినందుకు సైనా ఆనందం వ్యక్తం చేసింది.
ఇండియా ఓపెన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘అతను (సిద్ధార్థ్) ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నాడు. ఆ రోజు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అతనితో మాట్లాడలేదు. కానీ, అతను క్షమాపణ చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది మహిళలకు సంబంధించిన సమస్య. అలాంటి వాళ్లు మహిళలను టార్గెట్ చేయకూడదు. నేను దాని గురించి పట్టించుకోను. నేను నా స్థానంలో సంతోషంగా ఉన్నాను. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ పేర్కొంది.
Also Read: IND vs SA: సౌరవ్ గంగూలీ రికార్డుకు బీటలు.. నం.1 ఆసియా కెప్టెన్‌గా మారిన భారత టెస్ట్ సారథి..!
IND vs SA: సౌతాఫ్రికాలో నం.1 ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..!