FIFA WC 2022: ఫొటోలతో తిరుగుబాటు.. 7 యూరోపియన్ దేశాలపై ఫిఫా ఆగ్రహం.. ఇక టోర్నీ నుంచి బహిష్కరణేనా?

|

Nov 24, 2022 | 5:54 PM

తమ ఆటగాళ్లు ఎవరైనా వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి వస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫిఫా 7 యూరోపియన్ దేశాలను హెచ్చరించింది.

FIFA WC 2022: ఫొటోలతో తిరుగుబాటు.. 7 యూరోపియన్ దేశాలపై ఫిఫా ఆగ్రహం.. ఇక టోర్నీ నుంచి బహిష్కరణేనా?
Fifa World Cup 2022 One Love Band germany
Follow us on

ఫిఫా ప్రపంచ కప్ 2022లో , అన్ని జట్లు ఇంకా తమ తమ ప్రయాణాన్ని ప్రారంభించలేదు. కానీ అంతకు ముందే ఫిఫాలో గందరగోళం నెలకొంది. వివాదాలు ఊపందుకున్నాయి. ఇదే విషయం మరింత ముదిరితే మాత్రం టోర్నమెంట్ మధ్యలో 7 దేశాలు ప్రపంచ కప్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగితే తమ ఆటగాళ్లు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుట్‌బాల్ అత్యున్నత సంస్థ FIFA 7 యూరోపియన్ దేశాలను హెచ్చరించింది.

7 యూరోపియన్ దేశాలలో జర్మనీ కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసింది. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు తీసిన గ్రూప్ ఫొటోలో ఆ జట్టు ఆటగాళ్లు నోరు మూసుకున్నారు. ఆటగాళ్లతో పాటు జర్మనీ మంత్రి నాన్సీ ఫీజర్ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆమె ‘వన్ లవ్ ఆర్మ్‌బ్యాండ్’ ధరించి మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చేరుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఫిఫా హెచ్చరికతో 7 దేశాల్లో భయాందోళనలు..

‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్ అంటే ఏమిటో తెలుసుకునే ముందు, దాని గురించి FIFA ఏమి చెప్పిందో వివరంగా తెలుసుకుందాం. రెయిన్‌ కలర్ టీ షర్ట్స్ లాంటి దుస్తులు ధరించడం, లేదా వన్ లవ్ ఆర్మ్‌బ్యాండ్ ధరించే ఆటగాళ్లకు జరిమానా విధించబడుతుందని FIFA పేర్కొంది. FIFA ఇలా చెప్పిన తర్వాత కూడా ఏడు యూరోపియన్ దేశాల కెప్టెన్లు వన్ లవ్ ఆర్మ్‌బ్యాండ్ ధరించి మైదానంలోకి రావాలని ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఏదైనా జట్టు ఆటగాళ్లు ఇలా చేస్తే వెంటనే ఎల్లో కార్డు చూపిస్తామని ఫిఫా తెలిపింది. FIFA నిర్ణయాన్ని విమర్శించిన వారిలో జర్మనీ కోచ్ హన్సీ ఫ్లిక్, ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు బెర్ండ్ న్యూన్‌డోర్ఫ్ ఉన్నారు.

జర్మనీ ఆటగాళ్ల ఫొటో..

‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్ అంటే ఏమిటి?

‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్ అంటే ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజానికి సమానత్వానికి మద్దతుకు చిహ్నం. స్వలింగ సంపర్కం చట్టబద్ధం కాని ఖతార్‌లో కూడా ఇది ముఖ్యమైనది. ఇది కేవలం LGBTQ కమ్యూనిటీకి సంబంధించినది కాదు. క్రికెట్‌లో మోకరిల్లి బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతు ఇచ్చినట్లే ఫుట్‌బాల్ క్రీడాకారులు ఈ ఆర్మ్‌బ్యాండ్ ధరించడం ద్వారా సమానత్వ సందేశాన్ని అందించాలనుకున్నారు. కానీ, ఈ విషయాలు FIFA నియమాలు, నిబంధనలలో చేర్చనందున ఆటగాళ్లు వీటిని చేసేందుకు అనుమతించలేదు.

అయితే, FIFA హెచ్చరికతో ప్రభావితమైన 7 యూరోపియన్ దేశాలలో జర్మనీతో పాటు ఇంగ్లాండ్, డెన్మార్క్, స్వీడన్, బెల్జియం వంటి దేశాలు ఉన్నాయి. డెన్మార్క్ దాని గురించి UEFA దేశాలతో మాట్లాడిన తర్వాత FIFA ప్రపంచ కప్ నుంచి వైదొలగాలని యోచిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..