Indian Football Team: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. AIFFపై నిషేధాన్ని ఎత్తేసిన ఫిఫా.. భారత్‌లోనే U17 ప్రపంచ కప్..
FIFA Lifts Suspension On AIFF: ఆగస్ట్ 16న AIFFలో థర్డ్ పార్టీ జోక్యాన్ని ఆరోపిస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను సస్పెండ్ చేయాలని FIFA నిర్ణయించింది.
FIFA Lifts Suspension On AIFF: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (FIFA) ఎత్తివేసింది. ఆగస్ట్ 25 నుంచి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఫిఫా పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు భారత ఫుట్‌బాల్ అభిమానులకు మరో శుభవార్త అందింది. అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 ఇప్పుడు భారతదేశంలోనే జరగనుంది.
థార్డ్ పార్టీ జోక్యం కారణంగా FIFA AIFFని సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు దాన్ని తొలగించారు. ఫిఫా ఒక పత్రికా ప్రకటనలో, “ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)పై నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. మూడవ పార్టీల జోక్యం కారణంగా ఈ నిషేధం విధించినట్లు” పేర్కొంది.
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత, AIFF ట్వీట్ చేసింది. అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 సకాలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయని తెలియజేసింది. 11 అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ 2022 వరకు భారత్‌లో జరగనుంది.
AIFF నుంచి సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత, దాని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సునందో ధర్ మాట్లాడుతూ, “భారత ఫుట్‌బాల్ చీకటి సమయం చివరకు ముగిసింది. ఆగస్టు 26 అర్ధరాత్రి AIFFపై విధించిన సస్పెన్షన్‌ను FIFA ఎత్తివేసింది. ఇటువంటి కష్ట సమయాల్లో మమ్మల్ని నడిపించినందుకు FIFA, AFCకి ప్రత్యేకించి AFC సెక్రటరీ జనరల్ డాతుక్ సెరి విండ్సర్ జాన్‌కి మేం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం” అంటూ రాసుకొచ్చింది.
ఫిఫా సస్పెన్షన్‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇది భారత ఫుట్‌బాల్ విజయం అని పేర్కొన్నారు.
FIFA lifts suspension on AIFF
Read More ?https://t.co/nyN1xgFdBf
— Indian Football Team (@IndianFootball) August 26, 2022
Delighted to share the Bureau of the FIFA Council decided today to lift the suspension of the AIFF with immediate effect.
The FIFA U-17 Women’s World Cup 2022 scheduled to take place on 11-30 October 2022 will be held in India as planned !
A victory for all football ⚽️ fans!
— Anurag Thakur (@ianuragthakur) August 26, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..