Chess World Cup: కోనేరు హంపీకి తప్పని ఓటమి.. తొలి భారత మహిళగా దివ్య దేశ్‌ముఖ్ రికార్డ్..
FIDE Women’s Chess World Cup: జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ టైబ్రేకర్లలో తన స్వదేశీయురాలు కోనేరు హంపీని ఓడించి గెలుచుకుంది. మొదటి గేమ్‌ను డ్రా చేసుకున్న 19 ఏళ్ల దివ్య రెండవ రాపిడ్ గేమ్‌లో విజయం సాధించింది.

బ్లాక్ పావులతో ఆడుతున్న హంపి.. ఓ తప్పిదం చేయడంతో.. దివ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ప్రయోజనాన్ని పొందింది. దీంతో దివ్య తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించి, భారత్ తరపున 4వ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది.
ఈ విజయం దివ్యకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను కూడా సంపాదించిపెట్టింది. హంపి, ఆర్. వైశాలి, హారిక ద్రోణవల్లి తర్వాత గ్రాండ్‌మాస్టర్ అయిన నాల్గవ భారతీయ మహిళగా ఆమె నిలిచింది.
𝐃𝐢𝐯𝐲𝐚 𝐃𝐞𝐬𝐡𝐦𝐮𝐤𝐡 𝐝𝐞𝐟𝐞𝐚𝐭𝐬 𝐇𝐮𝐦𝐩𝐲 𝐊𝐨𝐧𝐞𝐫𝐮 𝐭𝐨 𝐰𝐢𝐧 𝐭𝐡𝐞 𝟐𝟎𝟐𝟓 𝐅𝐈𝐃𝐄 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 🏆.#FIDEWorldCup | #DivyaDeshmukh | #HumpyKoneru pic.twitter.com/CubWCPTlLX
— All India Radio News (@airnewsalerts) July 28, 2025
కేవలం 19 ఏళ్ల దివ్య ఈ టైటిల్‌ను గెలుచుకోవడం గమనార్హం. దీంతో ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ స్టార్‌గా ఆమె నిలిచింది. గత సంవత్సరం, దివ్య జూనియర్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది. ఇది మాత్రమే కాదు, ఈ టైటిల్ విజయంతో, ఆమె ఇప్పుడు భారతదేశపు నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా కూడా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..