AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepthi Jeevanji: విధిరాతకు ఎదురీది పారిస్‌లో సత్తాచాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్, మంత్రి సీతక్క అభినందనలు

పారాలింపిక్స్‌లో భారత్‌ చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు పారాలింపిక్ గేమ్స్‌లో ఇప్పటి వరకు 16 పతకాలు వచ్చాయి. మరిన్ని పతకాలు వచ్చేందుకు ఆస్కారం వచ్చింది. మహిళల 400 మీటర్ల టీ20 రేసులో స్ప్రింటర్ జ్యోతి జీవన్‌జీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. 21 ఏళ్ల ఈ అథ్లెట్ ఫైనల్లో 55.82 సెకన్లలో రేసును పూర్తి చేసి సంచలనం సృష్టించింది. ఆమె ఉక్రెయిన్, టర్కియే అథ్లెట్ల కంటే వెనుకబడి ఉంది.

Deepthi Jeevanji: విధిరాతకు ఎదురీది పారిస్‌లో సత్తాచాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్, మంత్రి సీతక్క అభినందనలు
Deepthi Jeevanji
Venkata Chari
|

Updated on: Sep 04, 2024 | 12:01 PM

Share

పారాలింపిక్స్‌లో భారత్‌ చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు పారాలింపిక్ గేమ్స్‌లో ఇప్పటి వరకు 16 పతకాలు వచ్చాయి. మరిన్ని పతకాలు వచ్చేందుకు ఆస్కారం వచ్చింది. మహిళల 400 మీటర్ల టీ20 రేసులో స్ప్రింటర్ జ్యోతి జీవన్‌జీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. 21 ఏళ్ల ఈ అథ్లెట్ ఫైనల్లో 55.82 సెకన్లలో రేసును పూర్తి చేసి సంచలనం సృష్టించింది. ఆమె ఉక్రెయిన్, టర్కియే అథ్లెట్ల కంటే వెనుకబడి ఉంది.

తెలంగాణ వాసి అయిన దీప్తి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్‌పై ఆసక్తి ఉండేది. పుట్టినప్పటి నుంచి మేధస్సు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు, బంధువుల హేళనలు వినాల్సి వచ్చింది. అన్ని కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. ఇందులో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కీలక పాత్ర పోషించారు. అతని సలహా దీప్తి ప్రపంచాన్నే మార్చేసింది.

మంగళవారం (సెప్టెంబర్ 4) రాత్రి జ్యోతి జీవన్‌జీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె తండ్రి ట్రక్ క్లీనర్ జీవన్‌జీ యాదగిరి తన ఇంటికి తిరిగి వచ్చి, భార్య ధనలక్ష్మి జీవన్‌జీతో సెలబ్రేట్ చేసుకున్నాడు.

సెప్టెంబరు 27, 2003న గ్రామంలోని డిస్పెన్సరీలో ఈ దంపతులకు మొదటి బిడ్డ జన్మించింది. అమ్మాయి తల చిన్నది, ముఖం అసాధారణంగా ఉంది. పెదవులు పగిలిపోయి, ముక్కు కూడా సరిగ్గా లేదు. తమ బిడ్డ రూపంపై ఆ దంపతులు గ్రామస్థులు, బంధువుల నుంచి దూషణలు ఎదుర్కొన్నారు. 5 వేలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామ వాసులు పత్తితో పాటు మామిడి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. జీవన్ జీ కుటుంబానికి అర ఎకరం పొలం ఉంది.

భూమిలో కొంత భాగాన్ని విక్రయించి..

యాదగిరి గ్రామ పొలాల్లో కూలీగా పనిచేసి అదనపు ఆదాయాన్ని పొందేవాడు. అయితే, అతని తండ్రి రామచంద్రయ్య మరణంతో కుటుంబం తమ భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. దీప్తి తల్లి మాట్లాడుతూ, “దీప్తి పుట్టినప్పుడు, గ్రామస్థులు, మా బంధువులు కొందరు ఆమెను కించపరిచేలా మాట్లాడారు. ఆమెను అనాథాశ్రమానికి ఇవ్వాలని చాలా మంది సూచించారు. ఆమె పెరిగేకొద్దీ, ఆమె శారీరకంగా చురుకుగా ఉండేది. కానీ, ఇతర పిల్లలు ఆమెను ఆటపట్టించినప్పుడు భావోద్వేగానికి గురవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది.

దీప్తి గురించి తల్లి మాట్లాడుతూ, “ఆమె తన చెల్లెలు అమూల్యతో ఆడుకోవడం, ఆమెతో బెల్లం కలిపిన అన్నం తినేందుకు ఇష్టపడేదని తెలిపింది.

2000ల చివరలో దీప్తిని గ్రామంలోని రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (RDF) పాఠశాలలో చేర్పించారు. స్కూల్ గ్రౌండ్‌లో స్నేహితులతో కలిసి నడుస్తున్న దీప్తిని పీఈ టీచర్ బియాని వెంకటేశ్వర్లు చూశాడు. దీప్తి ట్రాక్‌పై పరుగెత్తడాన్ని చూసి ఆమెకు సహాయం చేయాలని కోచ్ పాఠశాల యజమాని రామ్మోహన్ రావును అభ్యర్థించాడు. ఆమె పాఠశాల స్థాయిలో సామర్థ్యమున్న క్రీడాకారులతో పోటీ పడి 100 మీటర్లతో పాటు 200 మీటర్ల పరుగు పందెంలో కూడా పాల్గొంది.

పుల్లెల గోపీచంద్ సలహా..

జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దీప్తి శిక్షణను చూసి, సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ పర్సన్స్‌లో దీప్తిని పరీక్షించమని కోచ్‌కి సలహా ఇచ్చాడు. మూడు రోజుల పరీక్ష తర్వాత, పారా పోటీలలో పాల్గొనడానికి ఓకే చెప్పారు. ఈ క్రమంలో పారా నేషనల్స్‌లో పోటీ పడింది. ఆ తర్వాత మొరాకోలో జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో, అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన పారా ఓషియానియా పసిఫిక్ గేమ్స్‌లో 400 మీటర్ల టైటిల్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..