AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyothi Yarraji: విశాఖ అమ్మాయికి అర్జున అవార్డు.. గర్వంగా ఉందంటూ చంద్రబాబు కితాబు

Jyothi Yarraji: విశాఖపట్నానికి చెందిన ఒలింపియన్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డు సర్టిఫికెట్, ట్రోఫీ అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమంటూ ప్రశంసించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు సాధించిన జ్యోతి, పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Jyothi Yarraji: విశాఖ అమ్మాయికి అర్జున అవార్డు.. గర్వంగా ఉందంటూ చంద్రబాబు కితాబు
Jyothi Yarraji
Rakesh
|

Updated on: Nov 14, 2026 | 5:34 PM

Share

Jyothi Yarraji: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ అథ్లెట్, ఒలింపియన్ జ్యోతి యర్రాజీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి ఈ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జ్యోతి ఫొటోను పంచుకుంటూ అభినందన సందేశం పెట్టారు.

జ్యోతిపై చంద్రబాబు ప్రశంసలు

“ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మన స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అభినందనలు జ్యోతి. నీ విజయాల పట్ల మేమంతా గర్విస్తున్నాం. ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలి. మనందరికీ గర్వకారణంగా నిలవాలి” అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. జ్యోతి సాధించిన విజయాలను గుర్తుచేస్తూ ఆమెను అభినందించారు. ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు రావడంతో ఈ వార్త క్రీడాభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

నవంబర్ 13న అర్జున అవార్డు సర్టిఫికెట్

జ్యోతి యర్రాజీకి 2024 సంవత్సరానికి అర్జున అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పట్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఆమె హాజరుకాలేకపోయారు. దీంతో తాజాగా నవంబర్ 13న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా అర్జున అవార్డు సర్టిఫికెట్, ట్రోఫీ అందుకున్నారు. ఈ గౌరవంతో జ్యోతి తన క్రీడా ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు.

100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు

విశాఖపట్నానికి చెందిన జ్యోతి యర్రాజీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత జాతీయ రికార్డు సాధించిన అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. ఈ విభాగంలో ఆమె అత్యుత్తమ సమయం 12.78 సెకన్లు. 2023 ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించారు. 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం, 200 మీటర్ల పరుగులో రజతం గెలుచుకున్నారు. 2024 ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లో 60 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు.

ఒలింపిక్స్‌లోనూ భారత జెండా రెపరెపలు

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా జ్యోతి ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్న వయసు నుంచే అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. క్రమంగా జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు అర్జున అవార్డుతో ఆమె కృషికి మరో గుర్తింపు లభించింది. విశాఖపట్నం నుంచి ఎదిగి దేశానికి పేరు తెస్తున్న జ్యోతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించడం రాష్ట్ర క్రీడా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విశాఖ అమ్మాయికి అర్జున అవార్డు.. గర్వంగా ఉందంటూ చంద్రబాబు కితాబు
విశాఖ అమ్మాయికి అర్జున అవార్డు.. గర్వంగా ఉందంటూ చంద్రబాబు కితాబు
ఖరీదైన క్రీమ్స్ కాదు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..
ఖరీదైన క్రీమ్స్ కాదు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..
గ్రహాల అనుకూలత.. ఈ ఏడాది చివరికల్లా వీరు అనుకున్నది సాధిస్తారు..!
గ్రహాల అనుకూలత.. ఈ ఏడాది చివరికల్లా వీరు అనుకున్నది సాధిస్తారు..!
కరెంట్ లేకపోయినా వెలిగే లైట్లు.. కేవలం రూ.200కే..
కరెంట్ లేకపోయినా వెలిగే లైట్లు.. కేవలం రూ.200కే..
హార్దిక్ పాండ్యా కోసం పంజాబ్ కింగ్స్ భారీ ప్లాన్
హార్దిక్ పాండ్యా కోసం పంజాబ్ కింగ్స్ భారీ ప్లాన్
పైల్స్ తగ్గట్లేదా? ఒక్క గ్లాస్ ఇది తాగితే నొప్పి లేకుండా పోతాయి
పైల్స్ తగ్గట్లేదా? ఒక్క గ్లాస్ ఇది తాగితే నొప్పి లేకుండా పోతాయి
ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!
ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!
సినిమాను మించిన ట్విస్ట్.. 15 కిలోల బంగారం దోచేసిన సోషల్ మీడియా..
సినిమాను మించిన ట్విస్ట్.. 15 కిలోల బంగారం దోచేసిన సోషల్ మీడియా..
వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్
వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్
వీరికి రెండు మహా ధన యోగాలు.. సంపన్నులయ్యే రాశులివే..!
వీరికి రెండు మహా ధన యోగాలు.. సంపన్నులయ్యే రాశులివే..!