Guttha Jwala Interesting Comments: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన గుత్తా జ్వాలా.. విష్ణుపై ఆసక్తికరమైన కామెంట్స్
Guttha Jwala Interesting Comments: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు నెలల ముందు ఆమె ఎంగేజ్‌మెంట్ సైతం చేసేసుకుంది. కానీ ...
Guttha Jwala Interesting Comments: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు నెలల ముందు ఆమె ఎంగేజ్‌మెంట్ సైతం చేసేసుకుంది. కానీ ఇప్పటి వరకు పెళ్లి బాజా మాత్రం మోగలేదు. దీంతో జ్వాల పెళ్లెప్పుడు అని ఆమె ఫ్యాన్స్, స్పోర్ట్స్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు ఆమె తెరదించార. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు ఆమె పెళ్లాడబోయే విష్ణు గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా కోలివుడ్ నటుడు విష్ణు విశాల్ ప్రేమలో ఉన్న గుత్తా జ్వాలా.. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేతికి రింగ్ తొడిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు జ్వాలా. దీంతో వీరి పెళ్లి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రేమ జంట వివాహం ఎప్పుడు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయంపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా స్పష్టత ఇచ్చారు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని, అందరికి ఆ న్యూస్ అధికారికంగా చెబుతాను అని చెప్పారు. ఇంకా ఆలస్యం చేయాలి అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
విష్ణుపై ఆసక్తికరమైన కామెంట్స్:
కాగా, విష్ణు విశాల్‌పై గుత్తా జ్వాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విష్ణుది తనది ఒకే మనస్తత్వం. ముక్కుసూటిగా ఉండటం వల్లనే తనను కొంతమంది ఇష్టపడకపోవచ్చు. విష్ణు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. ఇద్దరి భావాలు ఒకేలా ఉండటంతోనే ఒకరికి ఒకరం దగ్గరయ్యాం అని అన్నారు. తన జీవితంలో అత్యంత నమ్మకస్తులుగా భావించే వ్యక్తుల్లో విష్ణు ఒకరు అని అన్నారు. అయితే విష్ణు మనసులో ఏదీ దాచుకోలేడు. ఏ విషయం తనకు తెలిసినా దానిని ఖచ్చితంగా షేర్ చేసుకోకుండా ఉండలేడు.
ఇద్దరి జంటలది రెండో వివాహమే:
ఇక ఈ ఇద్దరి జంటలది రెండో వివాహమే. బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో గుత్తా జ్వాలా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని దూరమయ్యారు. అప్పటి నుంచి జ్వాలా సింగిల్‌గానే ఉంటోంది. మరో వైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్.. 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతడు విశాల్ సంరక్షణలో ఉన్నాడు. మరోవైపు కెరీర్ విషయానికొస్తే గుత్తాజ్వాలా బ్యాడ్మింటన్ అకామీని ప్రారంభించగా, విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల జ్వాలా గుత్తా అకాడమీని ఎఫ్ ఎక్సలెన్సీని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో ఈ అకాడమీ ఉంది.