Australian Open 2021: జొకోవిచ్‌కి భారీ షాక్.. 3 ఏళ్ల వరకు ఆస్ట్రేలియాలోకి నో ఎంట్రీ?
Novak DJokovic: నోవాక్ జొకోవిచ్‌కు వ్యాక్సిన్ వేసుకోకుండానే ఆస్ట్రేలియా రావడానికి అనుమతి తీసుకున్నాడు. దీంతో ఇది చాలా దుమారం రేపింది. వివాదానికి దారితీసింది.
Novak DJokovic: ప్రపంచ నంబర్ వన్ పురుష టెన్నిస్ ఆటగాడు సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్(Novak DJokovic) ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 లో పాల్గొనలేడు. వీసా రద్దుకు వ్యతిరేకంగా అతను చేసిన అప్పీల్‌ను ఆస్ట్రేలియా కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం సెర్బియా స్టార్‌ను ఆస్ట్రేలియా నుంచి వెనక్కి పంపనున్నారు. జనవరి 17 సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022(Australian Open 2021)కి ఒక రోజు ముందు, మెల్‌బోర్న్ ఫెడరల్ కోర్ట్ జొకోవిచ్ వీసాను రద్దు చేయాలనే ఆస్ట్రేలియా ప్రభుత్వ మంత్రి నిర్ణయాన్ని సమర్థించింది. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుతం జకోవిచ్ త్వరలో ఆస్ట్రేలియా(Australia) నుంచి తిరిగి వెళ్లనున్నాడు. వివాదాల మధ్య జొకోవిచ్ టోర్నీ డ్రాలో చోటు సంపాదించాడు. కానీ, ప్రస్తుతం అతను కోర్టుకు వెళ్లలేడు.
జనవరి 14, శుక్రవారం, ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి జొకోవిచ్ వీసాను రద్దు చేయాలని నిర్ణయించారు. రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ అయిన సెర్బియా స్టార్ దేశం నుంచి తొలగించబడాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేశాడు. జనవరి 16 ఆదివారం నాడు, ముగ్గురు ఫెడరల్ కోర్టు న్యాయమూర్తులు వెటరన్ ప్లేయర్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీసాను రద్దు చేయాలనే ఇమ్మిగ్రేషన్ మంత్రి నిర్ణయాన్ని సమర్థించారు.
మూడేళ్ల పాటు జొకోవిచ్ ఆస్ట్రేలియా వెళ్లలేడా? ఆస్ట్రేలియన్ కోర్టు నిర్ణయం తరువాత, జొకోవిచ్ ఆస్ట్రేలియాలో ప్రవేశించకుండా మూడేళ్లపాటు నిషేధించవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, బహిష్కరణకు ఆదేశింస్తే సంబంధిత వ్యక్తి మూడేళ్లపాటు ఆస్ట్రేలియాకు తిరిగి రాకూడదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్‌కు ఈ నిబంధనను వర్తింపజేస్తుందా లేదా అతనికి మినహాయింపు ఇస్తుందా, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. జొకోవిచ్‌కు ఇంకా కోవిడ్-19 టీకాలు వేసుకోలేదు. అతను ఆస్ట్రేలియా విడిచి వెళ్లే వరకు మెల్‌బోర్న్‌లో గృహనిర్బంధంలో ఉంటాడు.
ఆస్ట్రేలియాలో కఠినమైన నియమాలు.. వాస్తవానికి, ఆస్ట్రేలియాలో కరోనాకు వ్యతిరేకంగా లాక్‌డౌన్ నుంచి టీకా వరకు కఠినమైన నియమాలు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం, ఆస్ట్రేలియన్ పౌరులు అయినప్పటికీ, టీకాలు వేసుకోకుండా ఎవరూ ఆస్ట్రేలియాలోకి ప్రవేశించడానికి అనుమతించరు. అయినప్పటికీ, ప్రత్యేక పరిస్థితులలో, సరైన కారణంతో వైద్య మినహాయింపుగా వ్యాక్సిన్ లేకుండా ప్రవేశం అనుమతిస్తున్నారు.
వివాదం ఇలా మొదలైంది.. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి జొకోవిచ్ వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఒక వైఖరిని తీసుకున్నాడు. అతను టీకాలు వేసుకోనని పేర్కొన్నాడు. దాని కోసం అతను చాలాసార్లు విమర్శలను ఎదుర్కొన్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడటంపై సందేహాలు వచ్చాయి. అయితే, అతను వైద్య మినహాయింపు నియమం ప్రకారం ఆస్ట్రేలియాలోకి ప్రవేశించాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.
ఆస్ట్రేలియా చేరుకున్నప్పుడు, అతని వీసా మొదట జనవరి 6న రద్దు చేశారు. అతని వద్ద తగిన వైద్య మినహాయింపు పత్రాలు లేనందున మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆపివేశారు. ఈ సందర్భంగా జకోవిచ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. దీని తరువాత కోర్టు విచారణ జరిగింది. జనవరి 10 న, ఆస్ట్రేలియా కోర్టు వీసా రద్దు నిర్ణయాన్ని రద్దు చేసింది. జొకోవిచ్‌ను ఆడటానికి అనుమతించింది. ఈ సమయంలో, జకోవిచ్ కూడా కోర్టులో ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత జనవరి 14న ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి మళ్లీ వీసా రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.
#BREAKING: Novak Djokovic will be deported from Australia after a Federal Court upholds the Immigration Minister’s decision to revoke the nine-time #AusOpen champion’s visa.
A lucky loser will replace Djokovic to face Miomir Kecmanovic in the first round Monday.
— TENNIS (@Tennis) January 16, 2022
Also Read: పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించడమే అతడు చేసిన పాపం..! కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది..?