FIFA World Cup 2022: ఫిఫా ఫైనల్ దెబ్బకు.. బద్దలైన 25 ఏళ్ల నాటి రికార్డులు.. ఆసక్తికర విషయాలు షేర్ చేసిన గూగుల్ సీఈవో..

అర్జెంటీనా 2-0తో ఫ్రాన్స్‌ను క్లీన్ చేస్తుందని భావించిన సమయంలో, లెస్ బ్ల్యూస్ 81వ నిమిషంలో గేమ్‌ను మలుపుతిప్పారు. రెండు గోల్‌లు ఒక నిమిషం వ్యవధిలో వచ్చాయి. ఫ్రెంచ్ స్టార్ కైలియన్ ఎంబాప్పే ఈ సమయంలో హీరోగా నిలిచాడు.

FIFA World Cup 2022: ఫిఫా ఫైనల్ దెబ్బకు.. బద్దలైన 25 ఏళ్ల నాటి రికార్డులు.. ఆసక్తికర విషయాలు షేర్ చేసిన గూగుల్ సీఈవో..
Fifa World Cup 2022 Final Winner
Follow us
Venkata Chari

|

Updated on: Dec 19, 2022 | 1:07 PM

Argentina vs France: ఆదివారం నాడు ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఫిఫా ఫైనల్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌పై విజయం సాధించి, మూడవ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సాధారణ, అదనపు 30 నిమిషాల సమయంలో ఇరుజట్లు 3-3 గోల్స్‌తో డ్రాగా నిలిచాయి. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా.. ఫిఫా విజేతగా నిలిచింది. లియోనెల్ మెస్సీ 23వ నిమిషంలో 12-గజాల రేంజ్ నుంచి గోల్ చేసి ఖాతా తెరిచాడు. ఇక పెనాల్టీ తర్వాత అర్జెంటీనా మరో ఎదురుదాడితో గోల్ చేసింది. ఈసారి స్కోర్‌షీట్‌లో డి మారియా పేరు చేరింది.

అర్జెంటీనా 2-0తో ఫ్రాన్స్‌ను క్లీన్ చేస్తుందని భావించిన సమయంలో, ఫ్రాన్స్ జట్టు ప్లేయర్లు 81వ నిమిషంలో గేమ్‌ను మలుపుతిప్పారు. రెండు గోల్‌లు ఒక నిమిషం వ్యవధిలో వచ్చాయి. ఫ్రెంచ్ స్టార్ కైలియన్ ఎంబాప్పే ఈ సమయంలో హీరోగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

108వ నిమిషంలో మెస్సీ అండ్ కో మూడో గోల్ కొట్టడంతో అర్జెంటీనా మరోసారి ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టగలిగింది. అయితే, 118వ నిమిషంలో పెనాల్టీ స్పాట్‌లో ఈక్వలైజర్ గోల్ చేయడంతో ఎంబాప్పే మరోసారి అర్జెంటీనా ప్రణాళికలను చెడగొట్టాడు.

అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్ తన ఉత్కంఠభరితమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆఖరి నిమిషాల్లో అతను కీలకమైన సేవ్ చేశాడు. రెండు స్పాట్ కిక్‌లను సేవ్ చేసి అర్జెంటీనాకు మూడవ ప్రపంచ కప్ టైటిల్‌ను అందించాడు.

అయితే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం ఒక ట్వీట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరల్డ్ కప్ ఫైనల్ సెర్చ్ వాల్యూమ్ పరంగా గత రికార్డులను బద్దలు కొట్టిందని ఆయన ధృవీకరించారు. ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. “#FIFAWorldCup ఫైనల్ సమయంలో 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసింది. ప్రపంచం మొత్తం ఒకే విషయం గురించి వెతుకుతున్నట్లుగా ఉంది” అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో ఇరు జట్లను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..