36th National Games: ‘ఒలింపిక్స్ ఆఫ్ ఇండియా’ క్రీడలకు రంగం సిద్ధం.. 7 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఇది జాతీయ క్రీడల 36వ ఎడిషన్. 98 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, ఇది ఎప్పుడూ స్థిరంగా లేదు. ఈ మధ్య ఈ క్రీడలకు విరామాలు వస్తున్నాయి. 1924లో లాహోర్ (నేటి పాకిస్థాన్ రాజధాని)లో తొలిసారిగా ఈ క్రీడలు జరిగాయి.

36th National Games: ఒలింపిక్స్ ఆఫ్ ఇండియా క్రీడలకు రంగం సిద్ధం.. 7 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఎప్పుడు, ఎక్కడంటే?
36th National Games

Updated on: Jul 08, 2022 | 4:52 PM

సెప్టెంబర్ నెలలో ఒలింపిక్స్ ఆఫ్ ఇండియా‌గా అని పేరుగాంచిన జాతీయ క్రీడలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మల్టీ-స్పోర్ట్ ఈవెంట్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని ఐదు నగరాల్లో (అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, భావ్‌నగర్, వడోదర) క్రీడలు జరుగుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలు జరిగే అవకాశం ఉంది.

ఏడేళ్ల తర్వాత దేశంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. గతంలో కేరళ 2015లో జాతీయ క్రీడలను నిర్వహించింది. భారత ఒలింపిక్ సంఘం సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా శుక్రవారం ఓ సోషల్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. మెహతా పోస్ట్‌లో- ‘జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదనను ముందుగానే ఆమోదించినందుకు IOAకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ పేర్కొ్న్నాడు.

గోవాలో ప్లాన్ చేస్తే.. గుజరాత్‌కు షిప్ట్..

ఇవి కూడా చదవండి

ఈ గేమ్‌లను ముందుగా గోవాలో నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా 2020లో గేమ్‌లను నిర్వహించకుండా గోవా ప్రభుత్వం విరమించుకుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో పూర్తి చేయాలనే చర్చ జరిగింది. ఇటువంటి పరిస్థితిలో, ఆటల ఆతిథ్యం నుంచి గోవా తప్పుకుంది.

98 ఏళ్ల నాటి టోర్నమెంట్‌..

ఇది జాతీయ క్రీడల 36వ ఎడిషన్. 98 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, ఇది ఎప్పుడూ స్థిరంగా లేదు. ఈ మధ్య ఈ క్రీడలకు విరామాలు వస్తున్నాయి. 1924లో లాహోర్ (నేటి పాకిస్థాన్ రాజధాని)లో తొలిసారిగా ఈ క్రీడలు జరిగాయి. 21వ శతాబ్దంలో కేవలం ఆరు రకాల గేమ్‌లు మాత్రమే ఉండేవి.

అవి నిరంతరంగా ఉండకపోవడానికి అతిపెద్ద కారణం దాని పెద్ద రూపం. ఇందులో దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు అన్ని క్రీడల్లో పాల్గొంటారు. ఇటువంటి పరిస్థితిలో, ఆటగాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఈ ఈవెంట్‌కు భారీ బడ్జెట్, మౌలిక సదుపాయాలు అవసరం. దీనిని ప్రభుత్వం అందించలేకపోయింది. అలాగే వనరులను కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి. జాతీయ క్రీడల నిర్వహణకు చాలా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఈ క్రీడలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.