మైనస్ 25 డిగ్రీలలో నిరంతర సాధన అంత ఈజీ కాదు.. కానీ, దేశం కోసం గెలవాలన్న కల ముందు ఇవన్నీ తక్కువే: ఆరిఫ్ ఖాన్

మైనస్ 25 డిగ్రీలలో నిరంతర సాధన అంత ఈజీ కాదు.. కానీ, దేశం కోసం గెలవాలన్న కల ముందు ఇవన్నీ తక్కువే: ఆరిఫ్ ఖాన్
Jammu And Kashmir Alpine Skier Arif Mohammed Khan

2022 Winter Olympic Games: కాశ్మీర్ లోయకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ఖాన్ 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడా పోటీలో..

Venkata Chari

|

Dec 04, 2021 | 8:28 PM

Arif Khan: కాశ్మీర్ లోయకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ఖాన్ 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడా పోటీలో పాల్గొనడానికి మైనస్ 20-25 డిగ్రీల సెల్సియస్‌లో సంవత్సరానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు స్కీయింగ్ సాధన చేస్తుంటాడు. అయితే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో న్యూస్9లైవ్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన ప్రాక్టీస్, అభిరుచులు, ఇంతవరకు రావడానికి గల ఎన్నో విషయాలను చర్చించాడు.

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా కొండ పాకెట్ నుంచి స్కీ టూర్ ఆపరేటర్ కుమారుడు మిస్టర్ ఖాన్, వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తన కలను సాకారం చేసుకోవడానికి గత నాలుగు సంవత్సరాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది నవంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఎంట్రీ లీగ్ ఎఫ్‌ఐఎస్ ఈవెంట్‌లో ఆల్పైన్ స్కీయింగ్‌లో భారతదేశం తరపున స్థానాన్ని దక్కించుకున్నాడు. 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా వింటర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లలో పాల్గొంటున్న ఆరిఫ్ ఖాన్ భారతదేశానికి 127 సార్లు ప్రాతినిధ్యం వహించారు.

“ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను మునుపటి ఒలింపిక్స్‌ను ఒక పాయింట్ తేడాతో కోల్పోయాను. శిక్షణ, సమయానుకూల ప్రయాణం కోసం నేను కొంత మద్దతును కోల్పోయాను. కానీ ఈసారి నా స్పాన్సర్‌లు JSW ఆరు నెలల ముందునుంచే నాకు మద్దతు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. దీంతో నేను సమయానికి అన్ని పూర్తి చేయగలుగుతున్నాను”అని ఇటలీలోని శాంటా కాటరినా నుంచి ఆరిఫ్ తన సన్నాహాలను వివరించాడు.

గుల్‌మార్గ్‌లో చిన్నతనంలో 1970 నుంచి క్రీడతో సంబంధం ఉన్న అతని తండ్రి ద్వారా ఆరిఫ్‌కు స్కీయింగ్ పరిచయం అయింది. “మానాన్న 2003 వరకు దాదాపు ఏడు సీజన్ల పాటు నాకు శిక్షణ అందించారు. ఆ సమయంలో నేను ఆల్పైన్ స్కీయింగ్ అనే క్రీడను మొదలుపెట్టాను. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధమైన రేసింగ్ క్రీడ. కానీ, భారతదేశంలో అప్పటికి ఈ క్రీడ గురించి ఎవ్వరికీ తెలియదు” అని పేర్కొన్నాడు. భారతదేశంలో ఈ క్రీడపై ఆసక్తి పెరుగుతుందని ఆరిఫ్ ఖాన్ భావిస్తున్నాడు. ప్రారంభించడం సులభమే. కానీ, దానిని ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఎంతో ఓర్పు, డబ్బు కావాలి. స్కీయింగ్ ఖరీదైన క్రీడ కావడంతో, ఆరిఫ్‌కు వృత్తిపరంగా దానిని చేపట్టేందుకు ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలా కష్టపడ్డారు.

“అతిపెద్ద సవాలు మౌలిక సదుపాయాలేనని, ఎందుకంటే ఈ క్రీడ ఐరోపా నుంచి వచ్చింది. ఇది చాలా యూరోపియన్ దేశాలతోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా బాగా పాపులర్ అయింది. ఆ రోజుల్లో మనకు ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవు. గుల్‌మార్గ్‌లో స్కీయింగ్‌కు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. కానీ, వృత్తిపరంగా ముఖ్యంగా క్రీడా ఈవెంట్‌లకు స్కీయింగ్ చేయడం ప్రధాన సవాలుగా మారింది. ఆ తరువాత మేం కొన్ని అభివృద్ధి చేశాం. అవి మాకు చాలా సహాయపడ్డాయి. ప్రాథమిక నైపుణ్యాలతోపాటు మరికొన్ని కీలకమైన అంశాలను తెలుసుకోగలిగాం’ అని ఆరిఫ్ ఖాన్ తెలిపారు.

మౌలిక సదుపాయాలు లేకపోయినా, ఆరిఫ్ చాలా చిన్న వయస్సులోనే ఈ ఆటపై తన ప్రేమను కనుగొన్నాడు. అతి త్వరలోనే ఈ ఆటలోని నైపుణ్యాలను ఒడిసిపట్టి మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరిఫ్ జూనియర్ స్థాయిలో పోటీ చేయడం ప్రారంభించిన తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. 2011లో సౌత్ ఆసియన్ వింటర్ గేమ్స్‌లో స్లాలోమ్, జెయింట్ స్లాలమ్‌లో ఆరిఫ్ రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఇది ఇప్పటివరకు జరిగిన ఏకైక ఎడిషన్ కావడం గమనార్హం.

“2005లో నేను జూనియర్ స్థాయిలో అంతర్జాతీయంగా రేసింగ్ ప్రారంభించాను. నేను దేశంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా మారాను. వివిధ దేశాలకు వెళ్లడంతో అక్కడ శిక్షణ, రేసింగ్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగుతూనే ఉన్నాను. నేను యూరప్, భారతదేశంలో శిక్షణ పొందాను. నేను సవాలును ఎలా అధిగమించాలో నేర్చుకున్నాను. దాంతోనే ఈ క్రీడలో మెరుగైన ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతున్నాను’ అని తన సక్సెస్ స్టోరీని పేర్కొన్నారు.

కేవలం కనీస సౌకర్యాల కొరత మాత్రమే కాదు, గత మూడు దశాబ్దాలుగా అశాంతి నెలకొన్న ప్రాంతంలో ఎదగడం కూడా సవాలుగా మారింది. గుల్మార్గ్ నియంత్రణ రేఖ నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆరిఫ్ తన కలను అనుసరించాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. దాంతో ఎన్నో కష్టాలు ఎదురైనా, తన పట్టును విడిపోలేదు.

“ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ సంఘర్షణ కొనసాగుతోంది. కానీ, నా కలను మాత్రం వదలకుండా కొనసాగించాను. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒలింపిక్స్‌లో పాల్గొనడం నా కల, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు మా స్కీయింగ్ ప్రదేశాలు, పర్వతాలను పరిచయం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగాను. నేను ఎల్లప్పుడూ ఈ ప్రత్యేక విషయంపైనే దృష్టి సారిస్తాను. ఇక్కడ సంఘర్షణలు ఎప్పుడూ ఉంటాయి. అలా అని నా కలను వదులుకోలేను. దానిని కొనసాగించడానికి చాలా కష్టపడ్డాను. చివరికి నేను దానిని సాధించాను’ అంటూ తను పడ్డ కష్టాలను వివరించాడు.

ఆరిఫ్‌కు స్కీయింగ్‌కు సంబంధించిన తొలి జ్ఞాపకాలు నాలుగు సంవత్సరాల వయస్సులో జరిగాయి. “నా చుట్టూ 10 అడుగుల ఎత్తులో మంచును చూడటం, దాని గుండా నడవడం జ్ఞాపకం ఉంది. నాకు గుర్తున్న మరో విషయం ఏమిటంటే స్కిస్ ధరించి మంచులో చిక్కుకపోయాను” అని ఆరిఫ్ పేర్కొన్నాడు.

ఆ తర్వాత నుంచి మెలుకువలు నేర్చుకున్న ఆరిఫ్ మంచులో చిక్కుకోకుండా ముందుకు సాగుతున్నాడు. 12 సంవత్సరాల వయస్సులో, అతను నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తన మొదటి ప్రదర్శన స్లాలోమ్‌లో స్వర్ణం సాధించాడు. 16 సంవత్సరాల వయస్సులో, అతను అంతర్జాతీయంగా పోటీ పడ్డాడు. అప్పటి నుంచి ఆరిఫ్ నాలుగు ప్రపంచ స్కీ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు. ఇటలీలో 2021 ఎడిషన్‌లో జెయింట్ స్లాలమ్‌లో 45వ స్థానంలో నిలిచాడు.

“బయట ఉన్నవారు నా యూనిఫామ్‌ని చూసి, అది భారతదేశం అని గుర్తిస్తారు. ఇది వారికి గొప్ప వార్త. ఎందుకంటే భారతదేశంలో మంచు ఉందని చాలా మందికి తెలియదు. ఆ తరువాత హిమాలయాల గురించి విన్నారు. భవిష్యత్తులో ఇక్కడ శిక్షణ, రేసులను ఏర్పాటు చేయాలంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు”అని ఆయన తెలిపారు. “మన పర్వతాలను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పరిచయం చేసిన మొదటి భారతీయుడిగా ఇది నన్ను ప్రేరేపించింది” అని గర్వంగా ప్రకటించాడు.

“భారతదేశంలో స్కీయింగ్‌కు కనెక్ట్ అయిన వ్యక్తులు నా ఫలితాలను అనుసరిస్తున్నారు. నేను ఎటువంటి వార్తలను వ్యాప్తి చేయలేదు. అది ప్రజలే గుర్తించారు. ఆ తరువాత నుంచి ఎంతోమంది నాకు కాల్స్ చేసి ఈ క్రీడ గురించి మాట్లాడారు”అని ఆయన పేర్కొన్నారు. “వారు నన్ను, నా కుటుంబాన్ని అభినందించారు. నేను అర్హత సాధించానో లేదో కూడా నాకు తెలియదు. నేను రేసులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాను. వింటర్ ఒలింపిక్స్‌కు ఎంపిక అయ్యాననే వార్త నా ఇంటి నుంచే అందింది’ అని పేర్కొన్నాడు.

దుబాయ్‌లో జరిగిన క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లలో పాల్గొన్న ఆసిఫ్ వింటర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో ఆరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వింటర్ ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడానికి ఆరిఫ్‌కు రెండు నెలల కంటే తక్కువ సమయం ఉంది. “నేను, నా కోచ్ వివిధ దేశాలకు చెందిన ముగ్గురు అథ్లెట్లతో ఉన్నాను. మేము చాలా కఠినమైన మంచుపై శిక్షణ పొందుతున్నాం” అని ఆరిఫ్ తన శిక్షణపై మాట్లాడాడు. ” ప్రస్తుతం ఇటలీలో శిక్షణను కొనసాగించాలి. ఆ తర్వాత మేం బోస్నియాకు రేసుల కోసం వెళ్లాలి. ఆ తరువాత టర్కీ, చెక్ రిపబ్లిక్‌తోపాటు జనవరిలో ఆస్ట్రియాలో కొన్ని రేసులకు వెళ్లాలి. ఒలింపిక్స్‌కు ముందు జరిగే ఆఖరి రేసు అది. కాబట్టి ప్రధానంగా ఒలింపిక్స్‌లో మాదిరిగానే సూపర్ ఐసీ స్నోపై దృష్టి సారిస్తున్నాం’ అని తన భవిష్యత్తు పోటీలను వివరించారు.

Also Read: Ajaz Patel: భారత్‌లో పుట్టాడు.. న్యూజిలాండ్ తరపున ఆడాడు.. 10 వికెట్లతో టీమిండియా నడ్డి విరిచాడు..

BWF World Tour Finals: ఫైనల్ చేరిన పీవీ సింధు.. హోరాహోరీ పోరులో యమగుచిపై ఘన విజయం..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu